Hanuman: హనుమాన్ జన్మస్థలంపై రగులుతున్న వివాదం!టీటీడీ కి కర్నాటక హనుమాన్ జన్మభూమి ట్రస్ట్ అల్టిమేటం!!

Tirupathi RUIA: Death Secrets got Viral
Share

Hanuman: హనుమంతుడి జన్మస్థలంపై మరో వివాదం నెలకొంది. హనుమంతుడు తిరుమలలోనే జన్మించాడంటూ టీటీడీ చేసిన ప్రకటనపై మరో వివాదం చెలరేగింది. టీటీడీ చేసిన ప్రకటనపై హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.టీటీడీ ప్రకటనను కర్నాటక హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తప్పుబట్టింది. ఈ మేరకు టీటీడీకి ఆరు పేజీల లేఖ రాసింది. అజ్ఞానపు, మూర్ఖపు పనులు చేయవద్దని ఘాటుగా వ్యాఖ్యానించింది.కల్పితాలు సృష్టించవద్దని టీటీడీకి విజ్ఞప్తి చేసింది. శాస్త్రీయ ఆధారాలతో వారంలోగా తమ లేఖకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే తామే తిరుమల వచ్చి తప్పును నిరూపిస్తామని హెచ్చరించింది.

Controversy rages over Hanuman's birthplace!
Controversy rages over Hanuman’s birthplace!

టీటీడీ తేల్చిందేమిటంటే!

హనుమంతుడు జన్మించింది.. అంజనాద్రి మీదే అంటూ పక్కా ఆధారాలు టీటీడీ బయపెట్టింది. పురాణాల నుంచి భౌగోళిక పరిస్థితుల వరకు చరిత్రను, ఇతిహాసాన్ని పరిశీలిస్తే… మారుతి మనవాడే అంటోంది. ఇంతకీ తిరుమల తిరుపతి దేవస్థానం బయటపెట్టిన ఆధారాలు ఏంటి.. అందులో ఏముంది ? సంతానం కలగడం లేదని పుట్టెడు దుఖంలో ఉన్న అంజనాదేవి.. ఓ సోదమ్మ చెప్పిన సలహాతో వేంకటగిరి మీద తపస్సు చేయడానికి వస్తుంది.ఆకాశగంగ తీర్థానికి సమీపంలో కేవలం వాయుభక్షణ చేస్తూ వాయుదేవుడి కోసం ఘోర తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన వాయుదేవుడు.. ఓ అమూల్యమైన ఫలాన్ని అందిస్తాడు. ఆ ఫలాన్ని తిన్న అంజనా దేవి.. గర్భాన్ని ధరిస్తుంది. అక్కడి నుంచి పదవ నెలలో.. శ్రావణ మాసంలో హనుమంతునికి జన్మనిస్తుంది. పుడుతూనే గొప్ప ఆకలితో… సూర్యున్ని పండు అనుకొని తినాలని ఎగురుతాడు. అలా ఎగిరింది కూడా అంజనాద్రి నుంచే అని పురాణాలు చెప్తున్నాయ్. ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తూ.. హనుమంతుడు పుట్టింది తిరుమల కొండపైనే అని కమిటీ తేల్చింది.

జాపాలీ తీర్థంలో హనుమంతుడి జననం :

అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో హనుమంతుడు జన్మించినట్లు కమిటీ వెల్లడించింది. శాసన, భౌగోళిక, పౌరాణిక, వాజ్ఞ్మయ ప్రమాణాలతో కమిటీ సభ్యులు ఆధారాలు సేకరించారు. వేంకటాచల మహత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నారు. అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడు. సూర్యబింబం కోసం వేంకటగిరి నుంచే హనుమ ఎగిరాడు. ఆంజనేయుడు తిరుమల కొండల్లోనే పుట్టాడని 12 పురాణాలు చెప్తున్నాయని వివరించారు.చీరాల కు చెందిన హనుమత్ ఉపాసకుడు చిదంబరశాస్త్రి చాలా పరిశోధనలు చేసి సమర్పించిన సాక్ష్యాధారాలను కూడా పరిగణనలోకి తీసుకొని టీటీడీ శ్రీరామనవమినాడు ఈ ప్రకటన చేసింది.ఇదే ఇప్పుడు వివాదాస్పదమైంది.

 


Share

Related posts

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి

somaraju sharma

Refrigerate: పొరపాటున కూడా ఫ్రిజ్‌ల‌లో వీటిని మాత్రం నిల్వ చేయకండి!!

Kumar

జగన్ Next పవర్ ఫుల్ టార్గెట్ : నారా లోకేశ్ ? ప్రూఫ్స్ సిద్ధమా ?

sekhar