NewsOrbit
న్యూస్

కరోనా డ్యాన్స్ తో అదరగొట్టేసిన అక్కా చెల్లెళ్లు.. నెట్టింట్లో వైరల్

corona dance by sisters from pune

కరోనా చేస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ప్రజలంతా చిగురుటాకులా వణికిపోతున్నారు. ఏం చేయాలన్నా.. ముట్టుకోవాలన్నా.. ఎక్కడికెళ్లాలన్నా.. చివరికి సాటి మనిషిని చూస్తేనే భయం కలిగే పరిస్థితులు వచ్చాయి. అంతగా ప్రపంచాన్ని గడగడలాడించేస్తోంది ఈ మహమ్మారి. రోజురోజుకీ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పాజిటివ్ తో ఆసుపత్రుల్లో చేరిన వారిలో మరణాల సంఖ్య పెరుగుతోంది. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అలా కోలుకున్న వారు పునర్జన్మ ఎత్తినట్టే భావిస్తున్నారు. అలా కోలుకున్నవారిని చూసి కుటుంబసభ్యులు సంతోషిస్తున్నారు. పూణెలోని ఓ యువతి తన అక్క కరోనా నుంచి కోలుకుని ఇంటికి రాగానే ఇలానే సంతోషించింది. కాకపోతే మరింత వరైటీగా.

corona dance by sisters from pune
corona dance by sisters from pune

 

పూణెలోని ఓ కుటుంబంలో కరోనా సోకింది. అక్కా చెల్లెళ్లలో అక్కకు కరోనా సోకింది. ఆమె ఇల్లు ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు కూడా. ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. చికిత్స తీసుకుని ఆమె కోలుకుని ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో ఫ్యామిలీ అంతా ఆనందంలో మునిగిపోయింది. అయితే.. ఆమె చెల్లెలు మాత్రం ఇందుకు భిన్నంగా అక్కకు స్వాగతం పలికింది. ఏకంగా రోడ్డు మీదకు వచ్చి అక్కకు తీన్ మార్ డ్యాన్స్ తో స్వాగతం పలికింది. పట్టరాని సంతోషంతో చెల్లెలు చేస్తున్న డ్యాన్స్ తో అక్క కూడా కాలు కదిపింది. ఆమెకు హారతులతో స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఇది కరోనా డాన్స్ అంటూ నెటిజన్లు అక్కాచెల్లెళ్ల ఆనందాన్ని చూసి సంతోషిస్తున్నారు.

author avatar
Muraliak

Related posts

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!