NewsOrbit
న్యూస్

శీతాకాలంలో కరోనా.. యమ డెంజర్ !!

 

కరోనా వైరస్ కేసులు రోజు రోజు కు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులకు కళ్ళెం వేయడానికి ఆయా ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.  పలు దేశాల వారు కరోనాకు వ్యాక్సిన్  కనుగొనే ట్రయల్స్ లో ఉన్నారు. కాని ఎప్పుటి నుండి  ప్రజలకు అందుబాటులోకి వస్తుందనేది  ప్రశ్నార్ధకమే !  భారత్ లో కేసుకు సంఖ్య ప్రతి రోజు లక్ష కు దగ్గరగా నమోదు అవుతున్నాయి. కాని మరణాల శాతం ఘననీయంగా తగ్గడం  సంతోషించదగిన విషయం.  కాగా రానున్న శీతాకాలం కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.  ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Coronavirus illustration of a virus on a turquoise background 3d render

అమెరికాలోని టెక్సాస్ హెల్త్ రిసోర్సెస్ లో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రామిరెడ్డి ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఇండియాలో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. అలానే అమెరికాలో శీతాకాలం ప్రవేశించిన కొద్ది రోజులకే వైరస్ పెరుగుదల కనబడుతుందని చెప్పారు. ఈ విషయాన్ని అమెరికా కు చెందిన వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం వెల్లడించింది.  ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలానే పెంపుడు జంతువుల నుంచి వైరస్ మనుషులకు సొకే అవకాశం ఉందని  తెలిపారు. ఈ క్రమంలోనే కుక్క నుండి మనిషికి వైరస్ వ్యాప్తి చెందినట్లు న్యూయార్క్ లో నమోదైందని పేర్కొన్నారు.  ఆహారం, నీరు వలన వైరస్ రాదని, అలానే కోళ్ళు, పందులకు కరోనా వ్యాపించదని డాక్టర్ రామిరెడ్డి స్పష్టం చేశారు. కరోనా భారిన పడిన వ్యక్తులు కుటుంబ సభ్యులకు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని సూచించారు. కరోనా వచ్చి తగ్గిన వారిలో మరల వైరస్ సోకే ప్రమాదం ఉందని అన్నారు. ఇండియాలో ఆరు కేసులు, హాంకాంగ్ లో ఒకటి వైరస్ రీ ఇన్ఫెక్షన్ ను గుర్తించినట్లు వెల్లడించారు. మొదటి సారి సోకిన వైరస్ జన్యుపదార్ధం, రెండవ సారి వచ్చిన వైరస్ జన్యుపదార్ధం మధ్య తేడా ఉన్నట్లు వైరాలజీ పరీక్షలలో గుర్తిస్తే రీ ఇన్ఫెక్ట్ అయినట్లు నిర్ధారిస్తారని తెలిపారు.   ఇప్పటి వరకు వైరస్ అత్యంత తక్కువ తేడాతో 15 సార్లు తన రూపాన్ని మార్చకుందని తెలిపారు.  కరోనా వైరస్ మొదటి దశలోనే ఉన్నామని, మొదటి దశ బాగా తగ్గిపోయి తిరిగి రెండో సారి పుంజుకుంటుందన్నారు. స్వైన్ ఫ్లూ లాగా ఇది కూడా శాశ్వతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా గర్బీణీ లకు కరోనా వైరస్ సోకితే ముందుగా డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. అలానే తల్లిరి కరోనా వైరస్ సోకితే పుట్ట బోయే బిడ్డకు కూడా వైరస్ సోకుతుంది అనే విషయం పై స్పష్టత లేదని వివరించారు.

రష్యా తీసుకువచ్చిన స్పుత్నిక్ వ్యాక్సిన్ పనిచేసే తీరుపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ వ్యాక్సిన్ అభివ్రద్ది చెందిన దేశాలు, చెందుతున్న దేశాలు మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నాయని  తెలిపారు. అలానే ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్  ట్రయల్స్ లో కొందరి వ్యక్తులకు న్చూరాలజీ ప్రాబ్లమ్స్ కనపడ్డాయని పేర్కొన్నారు. అందువలన ట్రయల్స్ ను మరల ప్రారంభించారని  తెలియజేశారు.

author avatar
S PATTABHI RAMBABU

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!