NewsOrbit
న్యూస్

కరోనా ! అందరూ మారాల్సిందేనా??

వెండి తెరపై అందాలు చూపడంలో అందెవేసిన ఆ అద్భుత కళా పురుషుడు ఇప్పుడు తానే ప్రకృతి అందాలు చూస్తూ పరవశించిపోతున్నాడు. కరోనా లాక్డౌన్ తో ఆయన కూడా తన జీవన శైలి మార్చుకోక తప్పలేదు.డెబ్బయి ప్లస్ వయస్సులో ఆయన సైకిల్‌ రైడ్ చేస్తున్నారు.ఆ కథా కమామీషు ఇదే ..


 

ఆధ్యాత్మిక చిత్రాలతో భక్తిని.. రొమాంటిక్‌ సినిమాలతో అందాల్ని ప్రేక్షకులకు రుచి చూపించే దర్శకుడు కె. రాఘవేంద్రరావు. ఎన్నో అపురూప చిత్రాలను తెరకెక్కించి దర్శకేంద్రుడిగా పేరు తెచ్చుకున్న రాఘవేంద్రరావు ప్రస్తుత ఖాళీ సమయాన్ని వ్యాయమాలు చేస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపేస్తున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా సినిమా చిత్రీకరణలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖలంతా ఇంట్లోనే కుటుంబసభ్యులతో, కొత్త విషయాలు నేర్చుకుంటూ గడుపుతున్నారు. వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా దర్శకుడు రాఘవేంద్రరావు తన ఇంటి ప్రాంగణంలోని పచ్చికబయళ్లపై సైకిల్‌ తొక్కుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఓ వీడియోను తన ట్విటర్ ఖాతా‌లో పెట్టారు. ‘‘ప్రపంచం మనకు అందించే వాటిలో ఉత్తమమైనవి.. ప్రకృతి, ఆరోగ్యం, నమ్మదగిన స్నేహితుడు’’అని ట్వీట్‌ చేశారు. ఈ వీడియోలో రాఘవేంద్రరావు సైకిల్ నడుపుతుంటే వెనకాలే ఆయన పెంపుడు శునకం రావడం కనిపిస్తుంది. చెట్లు, పచ్చిక బయళ్ల ప్రకృతిని ఆస్వాదిస్తూ… సైకిల్‌ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. వెనకాలే వస్తున్న శునకాన్ని నమ్మదగిన స్నేహితుడిగా అభివర్ణిస్తూ మూడింటిని ఒకే వీడియోలో చూపించి మరోసారి రాఘవేంద్ర రావు తన సృజనను చాటుకున్నారు..అందుకే ఆయన దర్శకేంద్రుడయ్యాడు.

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!