NewsOrbit
న్యూస్

తాజా వార్త :ఈవిఎంలపై కూడా కరోనా ఎఫెక్ట్ !

ఈవిఎంలు అనేక వివాదాలకు మూల బిందువులుగా ఇటీవల కాలంలో మారాయి. వీటిని హ్యాక్ చేయవచ్చునంటూ కొందరు సాంకేతిక నిపుణులు పవర్పాయింట్ డెమాన స్టేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.

పరాజయం పొందిన పార్టీలన్నీ ఈవీఎమ్ లను నిందిస్తూ అవి మాకు వద్దే వద్దంటూ జాతీయ స్థాయిలో రచ్చ కూడా చేసిన విషయం తెలిసిందే.వీటి విషయమై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి అలాంటి వారందరికీ ఇప్పుడు ఒక ఊరట కలిగించే వార్త ఇది. కరోనా వైరస్ ప్రభావం ఈవిఎంలపై కూడా ఉంటుందని కాబట్టి వాటి వాడుక సరికాదని ఎన్నికల సంఘం భావిస్తోందట. ఎందుకంటే ఈవీఎంల్లో ఓటు వేయాలంటే పంచ్ (మీట నొక్కాలి )చేయాలి. అలా ఒక్కో బూత్‌లో .. ఒక్క ఈవీఎంపై కనీసం వెయ్యి మంది ఒకే చోట టచ్ చేస్తారు.

 

అది కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం అవుతుంది. ఒక్క ఓటర్‌కు లక్షణాలు లేని కరోనా వైరస్ ఉన్నా.. ఇతరులకు వ్యాపించడం సులభం. అందుకే.. ఇప్పుడు.. బ్యాలెట్‌పై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముందుగా.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బ్యాలెట్ వాడే అవకాశం కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలకు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ లేఖ రాశారు. కోవిడ్ కారణంగా బ్యాలెట్ పేపర్, ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబధించి పార్టీల అభిప్రాయం తెలపాలని సూచించారు. ఈనెల 30 లోపు అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని లేఖలో ఎస్ఈసీ కోరింది. ఇది ఈవిఎంలను వ్యతిరేకించే పార్టీలన్నింటికీ అందివచ్చిన పెద్ద అవకాశం.

కాబట్టి అవన్నీ కూడా బ్యాలెట్ వైపే మొగ్గు చూపే అవకాశాలు మెండు.అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై మోజు చూపడం లేదు .మన తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను కూడా బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించటం ఇక్కడ గమనార్హం.ఇలా ఏ లెక్కన చూసినా ఈవీఎంలకు ఎవరు మద్దతిచ్చే సూచనలు గోచరించడం లేదు.ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లంటే మండిపడే తెలుగుదేశం పార్టీకి ఇది వీనుల విందైన వార్త .ఇప్పటికీ ఆ పార్టీ తమకు కేవలం ఇరవై మూడు సీట్లు లభించటం ఈవిఎంల వల్లేనని తప్పుడు భ్రమలో ఉండటం ఇక్కడ విశేషం. కాబట్టి బ్యాలెట్ అంటే టిడిపి ఎగిరి గంతేయ వచ్చునని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఈ విషయంలో ఇతర పార్టీల స్పందన ఏమిటో తెలియాలంటే ఈ నెల ముప్పై వ తేదీ దాకా వేచి చూడాలి !

 

author avatar
Yandamuri

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!