ఆ దేశంలో ఒక్క వారంలోనే లక్ష మంది పిల్లలకు కరోనా..!!

మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకి అమెరికా ఇంకా కోలుకోలేని పరిస్థితి లో ఉంది. అనేక దేశాలు కరోనా బారిన పడిన గాని త్వరగానే కోలుకున్నాయి. కానీ అమెరికాలో మాత్రం పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. రికార్డు స్థాయిలో ఇంకా పాజిటివ్ కేసులు నమోదు అవటంతో.. మొత్తంగా చూసుకుంటే కోటీ పాతిక లక్షలు కేసులు అమెరికా వ్యాప్తంగా నమోదు అయినట్లు లెక్కలు చెబుతున్నాయి.

Biden blasts Trump's response to the coronavirus pandemic - Los Angeles  Timesప్రపంచంలో ఉన్న 100 దేశాల పాజిటివ్ కేసులు కంటే అమెరికాలో నమోదైన కేసుల కంటే ఇది చాలా ఎక్కువ. ఇదిలా ఉండగా గత వారం రోజుల్లోనే అమెరికాలో లక్ష మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అమెరికా లోని పిడియాట్రిక్స్ అనే సంస్థ వెల్లడించింది. మొత్తంగా చూసుకుంటే అమెరికాలో పది లక్షల మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు అట. కానీ ఇటీవల వారం రోజుల్లోనే లక్ష మంది పిల్లలకు కరోనా సోకడంతో అమెరికా ప్రభుత్వం తెగ టెన్షన్ పడుతోంది.

 

ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో కంటే ఎక్కువగా అమెరికాలో పిల్లలు వైరస్ బారిన పడటంతో పిల్లల్లో వైరస్ ని నిరోధించడానికి అమెరికా ప్రభుత్వం జాతీయ వ్యూహాన్ని వెంటనే అమలు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైద్యులను అప్రమత్తం చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అమెరికాలో 14 శాతం మంది తల్లిదండ్రులు వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బ తింటున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా అమెరికాలో రానున్నరోజుల్లో వైరస్ తీవ్రత మరింత ప్రమాదకరంగా మారనున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్ పూర్తి పగ్గాలు చేపట్టే టైం కి దేశంలో రెండు కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. దీంతో అమెరికా ప్రభుత్వం కరోనా నిబంధనలను మరింత కఠినం చేసే ఆలోచన చేస్తోంది.