ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోందే తప్ప ఏ కోశానా తగ్గిన ఆనవాళ్ళు అయితే కనిపించడం లేదు. ఒకటి రెండు దేశాలను మినహాయిస్తే ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి ఉండడం గమనార్హం.
అయితే దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్ లో మాత్రం వైరస్ వ్యాప్తి వేగం వర్ణనాతీతం. బ్రెజిల్ హెల్త్ మినిస్ట్రీ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం గత 24 గంటల్లో ఆ దేశంలో 54 వేల కన్నా ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా వరుసగా నాలుగో రోజు 1200 మంది కన్నా ఎక్కువ మంది చనిపోవడం గమనార్హం.
ఇప్పటివరకు బ్రెజిల్లో 50 వేల మంది వైరస్ బారిన పడి చనిపోయారు. అవసరమైన స్థాయిలో టెస్టింగ్ చేయడంలో పూర్తిగా విఫలం కావడమే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ఒక మిలియన్ అనగా పది లక్షల పాజిటివ్ కేసులు నమోదు 2వ దేశంగా బ్రెజిల్ అవతరించింది. అమెరికా 2.2 మిలియన్ కేసులతో మొదటి స్థానంలో ఉంది.