NewsOrbit
న్యూస్

Corona Scam: రోజుకి వంద కోట్లు..! కరోనా స్కామ్ విలువ తెలుసా..!?

Corona Scam:  కరోనా మహమ్మారి దెబ్బకు పేద మధ్యతరగతి బతుకులు అప్పుల పాలై పోతున్నాయి. రోగమొస్తే పాణం బాగుజేసుకునేందుకు కార్పొరేట్ ఆస్పత్రులకు లక్షలకు లక్షలు ఫీజులు కట్టలేక ఇల్లు వాకిలి అమ్ముకొని రోడ్డున పడుతున్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో ట్రీట్​మెంట్​పై నమ్మకం లేక, కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లకు పోయి.. ఫీజుల దోపిడీతో వేల కుటుంబాల బతుకులు చితికిపోతున్నాయి. లక్షలు పోసినా అయినోళ్లు దక్కక, ఆస్తులు పోయిన బాధితులు ఎందరో ఉన్నారు.

ప్రయివేటు ఆస్పత్రులకు పండగే పండగ!

ప్రస్తుతం తెలంగాణలో సుమారు 19 వేలమంది కరోనా పేషెంట్లు వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. వీరిలో గవర్నమెంట్ హాస్పిటళ్లలో అడ్మిట్ అయిన వారు 5,500 మంది వరకు ఉండగా.. 13,500 మంది కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని ఒక లెక్క. దీంతో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర ప్రధాన నగరాల్లోని కార్పొరేట్ హాస్పిటళ్లతోపాటు ఇతర మీడియం, చిన్నతరహా ప్రైవేట్ హాస్పిటళ్ల బెడ్స్ అన్ని కరోనా పేషెంట్లతో నిండిపోయాయి. కనీసం రూ.3 లక్షలు అడ్వాన్స్ చెల్లించనిదే బెడ్ కన్ఫర్మ్ చేయడం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేరిన ఒక్కో పేషెంట్ నుంచి రోజుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల పైన చార్జీలు వసూలు చేస్తుండగా.. మీడియం, చిన్న స్థాయి హాస్పిటల్స్ లో మినిమం చార్జీగా రోజుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ఒక్కో పేషెంట్ వారం నుంచి రెండు వారాల వరకు హాస్పిటల్ లో ఉండాల్సి వస్తోంది. ఇలా రాష్ట్రంలో రోజుకు రూ.100 కోట్ల వరకు హాస్పిటల్ బిజినెస్ నడుస్తోందని అంచనా.

అప్పు చేస్తున్నారు!ఆస్తులమ్ముకుంటున్నారు!

లక్షల్లో వేస్తున్న హాస్పిటల్ బిల్లులు చెల్లించేందుకు కరోనా బాధిత కుటుంబాలకు ఆస్తులు అమ్మడం, తాకట్టు పెట్టడం తప్పా మరో దారి కనిపించడం లేదు.కరోనా కష్టకాలంలో అప్పులు పుట్టడం లేదు. ఇంటి పెద్ద హాస్పిటల్ బెడ్ పై ఉంటే.. అప్పులు ఇచ్చేటోళ్లు కూడా వెనకాడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు తమ ఇల్లు, ప్లాట్లు, పొలాల పేపర్లు, బంగారం తాకట్టు పెట్టి రూ.5 నుంచి రూ.10 మిత్తికి లక్షలాది రూపాయలు అప్పులు తెస్తున్నారు. మరికొందరు బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు తీసుకుంటున్నారు. ఇంకొందరైతే అప్పటికప్పుడు ఆస్తులు బేరానికి పెట్టి.. డబ్బులు తెచ్చుకుంటున్నారు. కుటుంబం మొత్తం హాస్పిటల్ లో అడ్మిట్ అయితే సుమారు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు బిల్లు అవుతోంది. దీంతో గత పది, పదిహేనేళ్లలో కష్టపడి కూడబెట్టిన డబ్బంతా ఒక్క దెబ్బతో ఖర్చయిపోతోంది.

ఇన్సూరెన్స్ కంపెనీలది ఇంకో మాయ!

అత్యవసర పరిస్థితుల్లో ట్రీట్ మెంట్ కోసం మెడికల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకున్న అనేక మందికి క్యాష్‌లెస్ చికిత్స అందటం లేదు. చాలా కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లలో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను యాక్సెప్ట్ చేయడం లేదు. అడ్వాన్స్ క్యాష్ చెల్లిస్తేనే అడ్మిట్ చేసుకుంటున్నారు. దీంతో ‘ముందు పైసలు కట్టి, ట్రీట్మెంట్ చేయించుకొని, రీయింబర్స్‌ మెంట్‌కు అప్లై చేసుకోండి’ అని ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు. పోనీ అలా అప్లై చేసుకున్నా.. పీపీఈ కిట్లు, శానిటైజేషన్‌ చార్జీలు, నెబ్యులైజర్‌ కిట్లు, స్టీమ్‌ ఇన్‌హీలర్లు, థర్మామీటర్ల ఖర్చుకు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదు. పైగా మొత్తం బిల్లుల్లో ఇన్సూరెన్స్ సంస్థలు కోత విధిస్తున్నాయి. దీంతో ముందస్తుగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించకున్నా ఇబ్బందులు తప్పడం లేదు.ఏతావాతా కరోనా ఎంతో మంది కుటుంబాలను అతలాకుతలం చేస్తోంది!

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?