TTD: ఎక్కడ వందకోట్లు?ఎక్కడ పన్నెండు కోట్లు !శ్రీవారి ఆదాయంపై కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఇది!!

Share

TTD: కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆదాయాల మీదనే కాదు.తిరుమలేశుని రాబడి మీద కూడా ప్రభావం చూపింది. సాధారణ పరిస్థితుల్లో దర్శన టిక్కెట్లు,ప్రత్యేక సేవా టిక్కెట్లు,,శ్రీవారి హుండీ , గదుల అద్దెలు తదితరాల వల్ల రోజుకు రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయలు టీటీడీకి ఆదాయం వచ్చేది. ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించినప్పుడు నెల మొత్తం మీద వంద కోట్ల రూపాయల వరకూ కూడా ఆదాయం సమకూరేది.అయితే మే నెలలో కేవలం పన్నెండు కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే టీటీడీకి లభించింది.టీటీడీ చరిత్రలోనే ఇది అతి తక్కువ ఆదాయం అని అధికార వర్గాలు చెబుతున్నాయి.

corona second wave effect on Srivari's income !!
corona second wave effect on Srivari’s income !!

TTD: ఆదాయం ఎందుకు పడిపోయిందంటే?

కరోనా సెకండ్ వేవ్ ను దృష్టి లో ఉంచుకొని టీటీడీయే భక్తుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తోంది.పరిస్థితులు బాగున్నప్పుడు వేంకటేశుని దర్శనానికి యాభై వేలమంది భక్తులను రోజూ అనుమతించేవారు.మార్చి నెలలో ఈ విధంగానే షెడ్యూల్ చేశారు.అయితే ఏప్రిల్ నుండి కరోనా సెకండ్ వేవ్ మొదలైంది.దీంతో మే నెల ఒకటో తేదీ నుండి ఇరవై వేల మంది భక్తులను మాత్రమే టీటీడీ దర్శనానికి అనుమతించింది.ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది.కానీ ప్రజలు కరోనా వ్యాధి తీవ్రతతో భయభ్రాంతులకు గురి కావడంతో కొండకు రావడం తగ్గించారు.మొదటి వారంలో భక్తుల సంఖ్య పదివేలు ఉంటే రెండో వారానికి అది ఐదు వేలకు పడిపోయింది.

Read More: Lungs: ఊపిరితిత్తులకు ఊపిరిని అందించండి ఇలా.. కరోనాను జయించండి..

కర్ఫ్యూ కూడా కారణమే!

ఇక ఆంధ్రప్రదేశ్లో మే అయిదో తేదీ నుండి కరోనా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పక్క రోజు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ ను అమలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రజా రవాణా కూడా బంద్ అయ్యింది.రైళ్లు, బస్సులు చాలావరకు రద్దయ్యాయి.ఈ పరిస్థితుల్లో వేల సంఖ్యలో భక్తులు తమ తిరుపతి ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు.పైగా టీటీడీ మే నెలలో మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శన టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులు సంవత్సరం లోపు ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకునేలా సడలింపు ఇచ్చింది.ఈ కారణంగా డబ్బు కూడా వృథా అయ్యే పరిస్థితి లేకపోవడంతో భక్తులు తిరుపతి ప్రయాణాలు విరమించుకున్నారు.కాగా జూన్ లో భక్తుల సంఖ్యను టీటీడీ ఇంకా తగ్గించడంతో ఈ నెలలో మరింతగా టీటీడీ ఆదాయం తగ్గిపోగలదని అంచనా వేస్తున్నారు.

 


Share

Related posts

బ్రేకింగ్: వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహేష్ ఫ్యాన్స్

Vihari

కొడాలి హిందూ వ్యాఖ్యల వెనుక అతి పెద్ద వ్యూహం..!!

Special Bureau

పెరుగుతున్న బంగారం ధరలు

sarath