NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

అదుగో టీకా..ఇదిగో తోక..!!

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,53,73,616 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ 6,30,193 మంది కోవిడ్‌తో మ‌ర‌ణించారు. ప్రస్తుతం 53,94,222 యాక్టీవ్ కేసులు ఉండగా, 99,79,394 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అగ్రరాజ్యం అమెరికా కరోనా కేసుల్లో ప్రధమ స్థానంలో ఉండగా భారత్ మూడవ స్థానానికి చేరుకొంది. అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజు రోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే 60 వేల‌కు పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కూ అమెరికాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41,00,875కు చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకూ అమెరికాలో 1,46,183 మంది మృతి చెందారు. ఆ తరువాత బ్రెజిల్, ఇండియా, రష్యా, సౌత్ ఆఫ్రికా, పెరు, మెక్సికో, చిలి, , స్పెయిన్, యూకే, ఇరాన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. భారత దేశంలో నేటి వరకు 12, 38,635 కేసులు నమోదు కాగా 29,861మంది మరణించారు. 7,82,607 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు.

 

టీకాల ఊసులు.. మూడు నెలల నుండి ఇదే బాట

టీకాలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. రష్యా, బ్రిటన్, జపాన్, జర్మనీ, అమెరికా, ఇండియా, చైనా, ఫ్రాన్స్ వంటి ప్రధాన దేశాల్లో టీకాలకు సంబంధించి రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే కరోనా పూర్తిగా రాకుండా వ్యాక్సినా ఇది, లేదంటే కరోనా వచ్చిన తర్వాత తగ్గడానికి ఇచ్చే టీకా (వాక్సినా)నా అనే దానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే రష్యాలోని ఆక్స్ ఫర్డ్ వాళ్ళు తయారు చేస్తున్న టీకా మీద రకరకాల పుకార్లు వస్తున్నాయి. కరోనా వచ్చిన వాళ్లకు ఇది మందు, రోగనిరోధక శక్తి అని. అలాగే అమెరికాలో కూడా ఇటు వంటి వాదనలే వస్తున్నాయి. ఇండియాలో భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేస్తున్న టీకా మీద ఇంకా క్లారిటీ లేదు. ఆగస్టు 15వ తేదీ టీకా రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ డానికి చాలా అవాంతరాలు ఉన్నాయి. ప్రస్తుతానికి తొలి దశ ప్రయోగాలు పూర్తి అయ్యాయి. ఇంకా రెండో దశ జరగాలి. మూడవ దశ జరగాలి. ఐసీఎంఆర్ అనుమతి ఇవ్వాలి. భారత ప్రభుత్వ ఆరోగ్య శాఖ అనుమతి ఇవ్వాలి. మళ్ళీ తుది దశలో మానవీయ ప్రయోగాలు జరగాలి. ఇవన్నీ జరగడానికి మూడు నాలుగు నెలలు అయినా పడుతుంది. అయినా ఆగస్టు 15కు రిలీజ్ చేస్తామని ఒక ప్రకటన ఇచ్చేశారు. అలాగే రష్యా కూడా ఆగస్టు తొలివారం లో టీకా వచ్చేస్తుందని ప్రకటిస్తున్నారు. అంటే టీకాల విషయంలో ఒక స్పష్టత లేదు. మూడు నెలల నుండి ఇలాంటి రకరకాల పుకార్లు, ప్రచారాలు జరుగుతునే ఉన్నాయి. వార్త ఎంత వరకు వాస్తవం అనేది తెలియదు కానీ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు సంబంధించి టీకాల విషయంలో ఇలాంటి ప్రచారాలు ఎక్కువ ఆశ కల్పిస్తోంది. సో.. ఇది ఇంత వరకు నిజం అనేది డబ్ల్యూ హెచ్ ఒ నుండి స్పష్టత రావడం లేదు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N