NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Corona Vaccine : ఇండియాలో ఉన్న రెండు రకాల వాక్సిన్ లలో ఏది బెస్ట్?

Corona Vaccine :  కరోనా వైరస్ second wave భారతదేశంలో విజృంభిస్తున్న దశలో వీలైనంత త్వరగా ఎక్కువ మంది భారతీయులుకి టీకాలు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే ఇండియాలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ పేరిట రెండు రకాల టీకాలు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుండి 45 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరికి ఈ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ల పై ఉన్న అనుమానాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. ఇలాంటి సమయంలో రెండు రకాల వ్యాక్సిన్లు ఉన్నప్పుడు దేనికి మొగ్గు చూపాలో తెలియక ప్రజలు అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు.

 

Corona Vaccine covishield covaxin differences
Corona Vaccine covishield covaxin differences

ఈ రెండు టీకాలలో ఏది మంచిది అనే విషయంపై ఇంకా సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పుడు రెండు వ్యాక్సిన్ల పనితీరు గురించి ఒకసారి చూద్దాం.

రెండు ఇంట్రామస్కులర్ టీకాలే. ఆక్స్ఫర్డ్ అస్ట్రాజెనెకా అభివృద్ధి చేయబడిన వ్యాక్సిన్ కోవిషీల్డ్. దీనిని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తిచేస్తుంది. వైరస్ ను నియంత్రించేందుకు ఈ వ్యాక్సిన్ రోగనిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఎబోలా వైరస్ కు వ్యతిరేకంగా అభివృద్ధి చేయడంలో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. రెండు డోసులలో ఉండే ఈ వ్యాక్సిన్ 81.3 percent సమర్థవంతంగా పని చేస్తున్నట్లు మెడికల్ రిపోర్టులు చెబుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 250 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దీని సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే ఇంజక్షన్ వేసిన చోట నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, చలి జ్వరం ఉంటాయి.

కోవాగ్జిన్ విషయానికి వస్తే దీనిని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. క్రియా రహిత వైరస్ వ్యాక్సిన్… కోవిడ్ వైరస్ కు వ్యతిరేకంగా రక్షణ రంగం సిద్ధం చేయడంలో తోడ్పడుతుంది. సీజనల్ వ్యాధులకు, ఇన్ఫ్లుయెన్జా, రాబిస్ వ్యాక్సిన్లు అభివృద్ధి చేసే టెక్నాలజీని ఉపయోగించారు. దీనిని కూడా రెండు డోసుల్లోనే తీసుకోవాలి. కోవాగ్జిన్ 80.6% ప్రభావితం చూపుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం. ప్రైవేట్ ఆస్పత్రిలో ₹250 దొరుకుతుంది

దీన్ని దుష్ప్రభావాలు చూస్తే ఇంజక్షన్ వేసిన చోట ఎర్రగా ఎర్రగా మారడం. చేయి మొద్దుబారినట్లు అనిపించటం. బలహీనత, ఒళ్ళు నొప్పులు, జ్వరం, తలనొప్పి అనారోగ్యానికి గురైనట్టు అనిపించడం. వికారం, వాంతులు కూడా ఉంటాయి. కానీ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. రెండూ ఒకే రకంగా ప్రభావంతమైనవి అయినప్పటికీ వేసుకున్న కోవాక్సిన్ వేసుకున్న వారు తో పోలిస్తే కోవిషీల్డ్ వేసుకున్మ కొద్దిగా సౌకర్యవంతంగా కనిపించారు. కోవ్యాగ్జిన్ కూడా ప్రతి ఒక్కరికి ఏమీ పై రియాక్షన్స్ ఇవ్వలేదు. దాదాపు కోవ్యాగ్జిన్ చాలామంది వేసుకొని కూడా బాగానే ఉన్నారు. ఇది కూడా బాగా ప్రభావవంతమైనది. దేని పనితీరు దానిది.

Related posts

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?