NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

మార్కెట్ లోకి కరోనా బిడ్డ… 10 రెట్లు ప్రమాదకరం..!

అవును.. మీరు చదివిన టైటిల్ కరెక్టే. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలం అవుతుంటే… మలేషియా సైంటిస్టులు మరో బాంబు పేల్చారు. ప్రస్తుతం ఉన్న కరోనా కంటే పది రెట్లు ఎక్కువ వేగంతో వ్యాపించే మరో కొత్త రకం వైరస్ ను గుర్తించినట్టు వెల్లడించారు.

corona virus mutated with D614G

అది ఎక్కడి నుంచో వచ్చింది కాదు.. కరోనా వైరస్ కొత్త రూపం. ఆ కొత్త రకం కరోనా వైరస్ పేరు డీ614జీ. ఈ వైరస్ ను మొదటగా భారత్ నుంచి మలేషియాకు తిరిగి వెళ్లిన ఓ వ్యక్తిలో గుర్తించారు.

ఆ వ్యక్తి అప్పటికే మరో 45 మందికి కరోనా వ్యాప్తి చేయగా.. అందులో ముగ్గురికి మాత్రం ఈ కొత్త రకం కరోనా వైరస్ డీ614జీ వచ్చినట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

ఈ కొత్త రకం కరోనా వైరస్ మలేషియాతో పాటు అమెరికా, ఐరోపా దేశాల్లోనూ విస్తరించిందట. అంటే.. ఒకవేళ ప్రస్తుతం ప్రపంచమంతా ఎదుర్కొంటున్న కరోనా వైరస్ ను కట్టడి చేయగలిగినా.. దాని నుంచి ఉత్పన్నమైన దాని బిడ్డ డీ614జీని మరోసారి ప్రపంచమంతా ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని సైంటిస్టులు చెబుతున్నారు.

ఒకవేళ అదే కనుక జరిగితే.. కరోనా కంటే ఎక్కువ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కరోనా కన్నా ఈ వైరస్ అతి ప్రమాదకరమైనది. దాని కన్నా 10 రెట్లు ఎక్కువగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.

ఒకవేళ కరోనాకు టీకాను తీసుకొచ్చినా.. ఆ టీకా ఈ కొత్త రకం వైరస్ మీద పనిచేయదు. మళ్లీ ఈ కొత్త రకం వైరస్ కోసం వ్యాక్సిన్ ను ప్రత్యేకంగా తయారు చేయాల్సిందే.

అయితే.. ఇందులో మరో మతలబు కూడా ఉంది. ఈ కొత్త వైరస్ కరోనా నుంచి మ్యుటేషన్ అయింది. అంటే ఉత్పరివర్తన చెందింది. నిజానికి ఇది కరోనా కన్నా 10 రెట్లు ప్రమాదకరమైనది అయినప్పటికీ.. కొన్ని రోజుల వరకే ఈ వైరస్ బతికి ఉంటుందట. ఆ తర్వాత ఇది బలహీనపడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ.. అది బలహీనపడేలోపు ఎంతమంది ఈ వైరస్ బారిన పడతారో అని సైంటిస్టులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

author avatar
Varun G

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju