coronavirus: ముఖ్యమంత్రులు కాపాడుతుంటే మోదీ ముంచేశాడు! వామ్మో… ఇది మారణహోమం

coronavirus second wave is due to modi
Share

coronavirus: ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ సృష్టిస్తున్న వైరస్ సునామి గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లక్షలకు పైగా కేసులు నమోదు అవుతుంటే… వేలల్లో జనాలు ప్రతిరోజు చనిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సెకండ్ లో 30 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు కూడా ప్రాణాలు కోల్పోవడం విచారకరం. అయితే దేశంలో ఇటువంటి భయానక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం తో సంబంధం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రులు వైపు మొగ్గు చూపుతుండటం ప్రశంసనీయం. 

 

coronavirus second wave is due to modi
PM Modi

తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్ డౌన్ దిశగా చర్యలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి జగన్ మధ్యాహ్నం నుండి పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కెసిఆర్ ఇవేమీ పట్టించుకోవడం లేదు. పరిస్థితి కంట్రోల్ లోనే ఉంది అని ఆ ప్రభుత్వం చెబుతోంది కానీ అక్కడ ఉన్న దారుణ పరిస్థితులు మనం డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ద్వారా చూడవచ్చు. 

ఇక ముఖ్యమంత్రులు అందరూ పూనుకుని తమ రాష్ట్ర ప్రజలను కాపాడే పనిలో ఉంటే మోదీ మాత్రం దేశాన్ని ఎలా ప్రమాదంలోకి నెట్టేశాడు అన్న విషయంపై తాజాగా ఒక లాన్సెట్ జర్నల్ ఒక వివరణ ఇచ్చింది. కరోనా నియంత్రణ కోసం గత ఏడాది నియమించిన టాస్క్ఫోర్స్ తో ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఒక్క సారి సమావేశం కూడా చేయలేదని వారు వ్యాఖ్యానించడం గమనార్హం. భారతదేశం కంటే ముందు సెకండ్ వేవ్ చాలా దేశాలలో వచ్చింది. అయినప్పటికీ…. మోడీ తీవ్ర నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను హరిస్తోంది అని ధ్వజమెత్తింది. 

ఈ ఏడాది ఆగస్టు నాటికి భారత దేశంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 10 లక్షలకు చేరుకుంటుందని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎలివేషన్ ఇచ్చిన అంచనాలను ఈ లాన్సెట్ జర్నల్ ప్రస్తావించింది. ఈ దారుణం గనుక సంభవిస్తే దానికి మోదీనే కారణం అవుతాడని తీవ్రస్థాయిలో విమర్శించింది. కొద్ది రోజుల క్రితం మద్రాసు హైకోర్టు కూడా ఒక పక్క సెకండ్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంటే ఎన్నికలు నిర్వహించిన ఈసిఐ పై మండిపడింది. మీరు హంతకులతో సమానం అని ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

ఇలా మోడీ స్వార్థపూరితంగా వ్యవహరించే ఎన్నికలు నిర్వహించాడని…. ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా అతను తీసుకున్న నిర్ణయం వల్ల మనం ఒక ప్రళయాన్ని చూస్తున్నామన్నది దీని సారాంశం. మరి భారతదేశ భవిష్యత్తు, మోడీ రాజకీయ భవిష్యత్తు ఈ కరోనా చేతుల్లోనే ఉన్నాయనడం లో ఎలాంటి సందేహం లేదు.


Share

Related posts

సొంత ఎమ్మెల్యేపై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

sridhar

బ్రేకింగ్: కరోనా వచ్చిందన్న అనుమానంతో హుస్సేన్ సాగర్ లో దూకిన వ్యక్తి

Vihari

చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు…?

somaraju sharma