కళ్లు తెరిచిన శవం… ‘షాక్’లో కుటుంబసభ్యులు.. అసలు ఏమైందంటే?

చనిపోయాడని అనుకున్న వ్యక్తి ఇ ఒక్కసారిగా కళ్ళు తెరిస్తే ఎలా ఉంటుంది? కొద్దిపాటి భయం వేసిన, చూడటానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. కుటుంబంతో ఎంతో సన్నిహితంగా కలిసిమెలిసి తిరిగిన వ్యక్తి ఒక్కసారిగా ప్రాణాలు వదిలితే ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగి పోతుంది. కానీ చనిపోయాడు అనుకున్న వ్యక్తి ఒక్కసారిగా కళ్లు తెరిస్తే ఎంతో ఆనంద పడిపోతారు. ఇలాంటి సంఘటనలు తరచూ వింటూ ఉంటాం. తాజాగా తమిళనాడులోని, కందంపట్టిలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ కుటుంబంలో బాల సుబ్రమణ్య కుమార్ అనే వ్యక్తిలో ఎటువంటి చలనం లేకపోవడంతో చనిపోయాడని కుటుంబ సభ్యులు నిర్ధారించి, శవాన్ని పాడవకుండా ఉండటానికి శవాల ఫ్రీజర్ అద్దెకు తెచ్చి అందులో ఉంచారు.

బాల సుబ్రమణ్య కుమార్ చనిపోయాడు అని నిర్ధారించిన కుటుంబ సభ్యులు తమ బంధువులు అందరికీ కబురు చేశారు. దీంతో బంధువులందరూ కుమార్ అంత్యక్రియలలో పాల్గొనడానికి వచ్చారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో శవాల ఫ్రీజర్ ఏజెన్సీ ఉద్యోగి మరుసటి రోజు ఫ్రీజర్ ను తీసుకువెళ్లడానికి అక్కడికి వచ్చాడు. అయితే ఆ వ్యక్తి అక్కడ ఒక వింత ఘటనను చూసి ఆశ్చర్యపోయాడు. శవపేటిక లోపల ఉన్న వ్యక్తిలో కదలికలను చూసి అదేంటి లోపల వ్యక్తి బతికే ఉన్నాడని అతని పరీక్షించగా అతడు శ్వాస తీసుకోవడం గమనించారు. దీంతో బాలసుబ్రహ్మణ్యం కుమార్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ కుటుంబ సభ్యుల పై కేసు నమోదు చేయగా వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆరోగ్య పరిస్థితి బాగా లేని వ్యక్తికి చికిత్స చేయించక పోవడం మానేసి, బ్రతికుండగానే అంత్యక్రియలు తీసుకెళ్తున్న నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు చలి తీవ్రతను తట్టుకోలేక అతని ప్రాణం తిరిగి వచ్చిందని పోలీసులతో వింత వాదన చేశారు. అయినా సుబ్రమణ్య కుమార్ 20 గంటల పాటు చలి తీవ్రతలో ఎలా తట్టుకొని ఉన్నాడు అన్నది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.