NewsOrbit
న్యూస్

సీబీఐ లోనే అవినీతి రాజాలు!నలుగురు ఉన్నతాధికారుల అరెస్ట్!

AP Politics: CBI Changed by BJP Influence..?

ఏదైనా మేజర్ సంఘటన జరిగితే చాలు సీబీఐ విచారణ కావాలి అన్న డిమాండ్ వినిపిస్తుంది.సీబీఐ కి ఉన్న విశ్వసనీయత అది.అయితే అదే సీబీఐలో లంచగొండులు ఉన్నారని తేలితే?… ఇప్పుడు అదే జరిగింది! దేశంలో ప్రకంపనలు రేపుతోంది!!

ఒక బ్యాంక్ ఫ్రాడ్ కేసులో నిందితులను కాపాడేందుకు భారీగా లంచం తీసుకున్న సీబీఐ అధికారులను గుర్తించి అరెస్టు చేశారు.వివరాల్లోకి వెళితే …సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం తమ సొంత హెడ్ క్వార్టర్ లోనే రైడింగ్ జరిపి నలుగురు అధికారులను బుక్ చేసింది.

ఇద్దరు డీఎస్పీలతో సహా నలుగురు అరెస్ట్!

ఓ కంపెనీ నుంచి లంచం తీసుకునేందుకు మరో ఏజెన్సీ హెల్ప్ చేసిందని తేలింది. 14లొకేషన్లలో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించిన అధికారులకు చార్టెర్డ్ అకౌంటెంట్స్ కూడా పట్టుబడ్డారు.‘డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్, స్టెనో, ప్రైవేట్ పర్సన్/ఇతరులు కలిపి మొత్తం నలుగురు అధికారులపై సీబీఐ కేస్ రిజిష్టర్ చేసింది. ఢిల్లీ, ఘాజియాబాద్, నోయిడా, గుర్‌గావ్, మీరట్, కాన్పూర్ పరిధుల్లో సెర్చింగ్ నిర్వహించారు. గురువారం రాత్రి కూడా కొన్ని ఆఫీసులు సెర్చింగ్ చేసిన అధికారులు సీజీఓ కాంప్లెక్స్ లోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో దర్యాప్తు చేసి నలుగురిని అరెస్టు చేశారు.ఇద్దరు డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీసులు ఆర్కే రిషీ, ఆర్కే సంగ్వాన్, స్టెనోగ్రాఫర్ సమీర్ కుమార్ సింగ్, ఇన్‌స్పెక్టర్ కపిల్ ధాంకడ్ లను అదుపులోకి తీసుకున్నారు.ఒకరు బ్యాంకింగ్ అండ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ సెల్ లో పనిచేస్తున్నట్లుగా చెప్పారు. గురువారం రాత్రి సమయంలో ఆఫీసులన్నీ సెర్చ్ చేసి వారిని పట్టుకున్నారు. ముంబైలోని ఓ ప్రైవేట్ కంపెనీతో చేసిన రూ.3వేల 500 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసుతో వీరికి సంబంధమున్నట్లు తెలిసింది.కంపెనీ ప్రమోటర్లతో, మధ్య వర్తులతోనూ అధికారులకు సంబంధాలున్నాయి. సీబీఐ స్పెషల్ యూనిట్ వర్గాల కథనం ప్రకారం అనుమానితులపై ప్రత్యేక నిఘాపెట్టేసరికి దొరికేశారు.ఈ కేసులో నిందితులకు కొందరు సీబీఐ అధికారులు సహకరిస్తున్నారంటూ ఫిర్యాదులు సిబిఐ టాస్క్ఫోర్స్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిని పట్టేసింది

ఏ కేసులో అంటే?

2018 ఆగష్టులో చేసిన సెర్చెస్ లో సీబీఐ 20రోలెక్స్ లగ్జరీ వాచ్ లు, రూ.3.6కోట్ల నగదు, రూ.1.6కోట్ల విలువైన బంగారం తివారీ అనే వ్యక్తి ఇంట్లోని కప్ బోర్డు నుంచి స్వాధీన పరచుకున్నారు. సీబీఐ డాక్యుమెంట్లతో సహా హవాలా నగదు లావాదేవీలను నిరూపించింది. తివారీ సర్వీసెస్ పేరిట విదేశాలకు అక్రమంగా నగదు తరలిస్తున్నట్లుగా తేల్చారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినైనా నేర నిరూపితమవలేదని.. ఇద్దరిపై మాత్రమే యాక్షన్ తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ కేసును తొక్కిపెట్టడానికి దొరికిపోయిన సీబీఐ అధికారులు భారీ ఎత్తున లంచాలు తీసుకున్నారని సిబిఐ వర్గాలు చెప్పాయి.

 

author avatar
Yandamuri

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju