COSTLY COTTAGE: అయ్య బాబోయ్: ఆ కాటేజ్ కోసం అన్ని కోట్లా.. స్పెషల్ ఏంటి..?!

Share

COSTLY COTTAGE:మనం ఇల్లు కొనాలంటే అక్కడ నీరు, కరెంట్, రోడ్, డ్రైనేజీ ఇలా అన్ని చూసుకొని గాని ఇల్లు తీసుకొం. ఇవ్వన్నీ ఉన్నాయా లేదా అనేది ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటాం. ఇక ఇంటర్ నెట్ లేకపోతే అటువైపు అస్సలికి వెళ్ళం. ఈరోజుల్లో ఇల్లు కొనాలంటే ఇవన్నీ చూస్తాం. వీటితో పాటు ఖర్చు కూడా కొంచెం తక్కువ ఉండేలా చూస్తాం. అయితే ఇవేమి లేని ఒక కాటేజ్‌ ఏకంగా రూ.5.5 కోట్లకు అమ్మకానికి పెట్టారు. అవును ఇది అస్సలు నమ్మలేని నిజం. అయితే అక్కడ స్పెషల్ ఏంటి, ఇంతకీ అది ఎక్కడి ఉంది అనేది ఒకసారి తెలుసుకుందాం.

AP High Court: ఏపి సర్కార్ పై మరో సారి మండిపడిన హైకోర్టు..! ఎందుకంటే..?
ఈ కాటేజ్‌ బ్రిటన్‌ లో ఉంది. అయితే కరెంట్, నీరు, ఇంటర్నెట్ ఇటువంటివి ఏమి లేకుండా అత్యధిక మొత్తానికి అమ్మకానికి పెట్టడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తున్నది. డేవాన్‌ సముద్రం ఒడ్డున ఉన్న ఈ ఆఫ్‌ గ్రిడ్‌ హౌస్‌ కి ఇంత ధర పెట్టడానికి ఒకటే కారణం. దీని ప్రత్యేకత ఏంటంటే.. నిలి సముద్రానికి సమీపంలోని ఎత్తైన కొండ ప్రాంతంలో ఉండటమేనంట. ఈ కాటేజ్‌ నేషనల్‌ ట్రస్ట్‌ యాజమాన్యంలోని మన్సాండ్ బీచ్‌ పైన ఉన్న రిమోట్‌ గేట్‌ అవేలో ఉంది. ఇక్కడ ప్రకృతి మధ్య ప్రశాంతంగా ఉండాలి అనుకునేవారాకి ఇది బాగా నచ్చుతుంది. అందుకే ఏకంగా రూ.5.56 కోట్లకు ఆ కాటేజ్‌ను అమ్మకానికి పెట్టారు. విశేషం ఏంటంటే.. ధర ఎంత ఉన్న కొనడానికి మాత్రం చాలా మంది ముందుకు వస్తున్నారట.

Ganesh Festival: విఘ్నాధిపతి వేడుకలకే విఘ్నాలు..! గవర్నర్ జీ ఏమి చేస్తారో..?
ఈ కాటేజ్‌ లో రెండు పెద్ద బెడ్‌ రూంలు ఉన్నాయి. పైన ఒక గడ్డితో చేసిన గది ఉన్నది. ఇందులో లాంజ్‌, డైనింగ్‌ రూం, ఫ్రంట్‌ అండ్ బ్యాక్‌ వరండా, రెండు గెస్ట్‌ బెడ్‌ రూంలు, పవర్‌ రూం, వంట గదులను కలిగి ఉన్నది. ఈ కాటేజ్‌ ను 1,345 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. కిచెన్‌ లో గ్యాస్‌ కుకర్‌, ఎల్‌పీజీ లైట్లు ఉన్నాయి. వర్షపు నీటిని నిల్వ చేసి తాగునీటిగా మార్చే సదుపాయం కలిగి ఉన్నది. ఈ కాటేజ్‌ కు వెళ్లేందుకు బీచ్‌ నుంచి రోడ్డు ఉన్నదని, ఈ ప్రదేశం కారు పార్కింగ్‌ నుంచి కేవలం 15 నిమిషాల్లో నడిచి చేరుకోవచ్చునని ఈ ఆస్తి విక్రేత మిచెల్‌ స్టీవెన్స్‌ తెలిపారు.

CHILD BORN: ఆ వ్యాధి తోనే వృద్ధురాలిగా జన్మించిన చిన్నారి.. అసలు మ్యాటర్ ఏమిటంటే …?


Share

Related posts

Love Relationship: మీ ప్రేమ బంధం ఎటువంటిదో తెలుసుకోండి!!

siddhu

HBD Allu Sirish: అల్లు శిరీష్ – అను ఇమాన్యుయేలది “ప్రేమ కాదంట” మూవీ ఫస్ట్ లుక్..!!

bharani jella

పూజా హెగ్డే తెలివితేటల కి పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా దండం పెట్టేస్తున్నారు !

GRK