ప్రత్యర్థుల మీద విమర్శలు చేసేటప్పుడు కరెక్ట్ పాయింట్ ని పట్టుకోకపోతే అది రివర్స్ అవుద్ది ! ఆ తర్వాత సదరు నాయకుడే నాలుక పీకోవలసి ఉంటుంది.
ప్రత్యర్థులపై వెటకారంతో కూడిన సెటైర్లు వేసే వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు ఈ చేదు అనుభవం ఎదురైంది!ఆయన చేసిన ఒక కామెంటు బూమరాంగ్ అయింది.ఆ కామెంటుకు వస్తున్న కౌంటర్లను చూసి రాంబాబుకు అంబ పలుకుతోంది!వివరాల్లోకి వెళితే ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాంబాబు ఒక ట్వీట్ చేస్తూ స్వరాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోలేని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లకి రాష్ట్ర రాజకీయాలు గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ విమర్శించారు!అంతే.మ తెలుగు తమ్ముళ్లు ,జన సైనికులు రంగంలోకి దిగారు.అంబటి వ్యాఖ్యలను ఖండిస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎక్కడి నుంచైనా జరుపుకోవచ్చని వారు అన్నారు. దేశంలోనే కాదు పర దేశంలో కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవచ్చని వారు చెప్పారు.ఇది దేశానికి సంబంధించిన వేడుకని ఆ విషయం కూడా తెలియని అంబటి రాంబాబు ఎలా ఎమ్మెల్యే అయ్యారని వారు నిలదీశారు! ఇదేమీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కాదని,రాష్ట్రంలోనే ఉండి జరుపు కోవాల్సిన అవసరం లేదని వారు బలమైన కౌంటర్ ఇచ్చారు.ఇక మీ చిల్లర రాజకీయాలు ఆపమని కూడా సలహా ఇచ్చారు.ఆంధ్ర రాష్ట్రం మీద అంతా ప్రేమున్న మీరు కరోనా సోకితే పక్క రాష్ట్రంలో చికిత్స ఎందుకు చేయించుకున్నారు! ఇక్కడే చేయించుకోవచు కదా అని కూడా వారు అంబటిని నిగ్గదీశారు.దీంతో రాంబాబు వైపు నుంచి సౌండ్ లేకుండా పోయింది!అలా అంబటి వారికి దొరికిపోయాడు!