పెళ్ళిలో నీచం పని చేసిన భార్యాభర్తలు.. చితకబాదిన బంధువులు!

శుభకార్యాలొస్తే చాలు ఎక్కడెక్కడో ఉన్న బంధువులందరూ ఆ ఇంట్లో దిగాల్సిందే. వారికి అతిథి మర్యాదలు చేయాల్సిందే. అందరూ ఒకలా ఉంటారంటే అది కాదు. ఒక్కొక్కరూ ఒక్కొక్కలాగ ప్రవర్తిస్తుంటారు. కాని ఏ శుభకార్యానికైనా సరే చుట్టాల సరదాలు పక్కాగా ఉండాల్సిందే.. దాంట్లోనే ఎప్పుడో ఒక్కసారి కలుసుకుంటాము ఎప్పుడు కలుసుకుంటామా ఏంటనే కుటుంబ సమేతంగా వస్తుంటారు చాలా మంది. అయితే కొన్ని కొన్ని సందర్భాలల్లో చుట్టాల హడావుడిలో అసలు కొన్ని వస్తువులు పూర్తిగా కనిపించవు. ఈ తర్వాత చూద్దాంలే చిన్న వస్తువేగా అని భావిస్తారు.

కాని కొన్ని సార్లు విలువైన వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి. ఇలాంటి అనుభవాలున్నవారు చాలా మందే ఉన్నారు. ఇదిలా ఉంటే మన సాంప్రదాయం ప్రకారం పెళ్లికూతురుకి ఆమె కుటుంబం వారు బంగారు ఎంతో ప్రేమగా పెడతారు. ఆ బంగారు పెళ్లికూతురు వారి తల్లిదండ్రుల గుర్తుగా వేసుకుంటుంది. కాని ఓ పెళ్లిలో మాత్రం ఇంటికొచ్చిన బంధువులు వారి చేతి దురుసును ప్రవర్తించారు. వదువుకు పెట్టాల్సిన మూడు తులాల బంగారు ఆభరణాలను స్వాహా అనిపించారు. గుట్టు రట్టు కావడంతో ఇంకేముంది దొంగ దంపతులకు దేహ శుద్ధి చేసి చేతివాతలతో మంచిగా వీడ్కోలు ఇచ్చి పంపించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. కామారెడ్డిలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో ఓ పెళ్లి ఘనంగా జరుగుతోంది. అయితే పెళ్లి వేడుకలకొచ్చిన తమ బంధువులు గుట్టుచప్పుడు కాకుండా వధువు మూడు తులాల బంగారు ఆభరణాలు నొక్కేసారు. అయితే వీరు పెళ్లి కూతురు తరఫువారేనట. పెళ్లిలో వధువు మెరవాల్సిన భంగారు ఆభరణాలు కనబడకపోయే సరికి వధువు కటుంబ సభ్యులు అలెర్ట్ అయ్యారు. ఇంకేముంది దెబ్బకు ఠా… దొంగల ముఠా అని చేతి వాటానికి పని చెప్పిన వారిని పట్టేసుకున్నారు. సాఫీగా సాగాల్సిన పెళ్లిలో వీరు పెట్టిన పెంటను వారు అంత ఈజీగా తీసుకోవలేదు.

అందుకే వారు వారికొచ్చిన పద్ధతిలో దొంగ దంపతులకు దెబ్బల బహుమతినిచ్చారు. దేహశుద్దితో వారి పాపానికి పరిష్కారం కనుగొన్నారు. అంతేకాదండోయ్ పోలీస్ అయ్యవారికి కూడా అప్పగించారు. అయితే ఆ బంగారాన్ని దొంగలించిన దొంగదంపతులు ఇందిరానగర్ కాలనీకి చెందిన వారట. వారి పేర్లు పరమేశ్, యశోదలుగా గుర్తించారు. ఈ దొంగతనానికి గానూ కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. చూశారు కదా పెళ్లిల్లో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. వారి చేతివాటాన్ని ఇలా ప్రదర్శించి అభాసుపాలవుతుంటారు.