నేషనల్ హెరాల్డ్ ఆఫీసు ఖాళీ చేయండి: కోర్టు

నేషనల్ హెరాల్డ్ కార్యాలయం ఖాళీ చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అసోసియేటెడ్ జర్నల్స్ సంస్థ అధీనంలో నేషనల్ హెరాల్డ్ నడుస్తోంది. ఈ సంస్థ కాంగ్రెస్ అధినాయకులైన సోనియా గాంధీ కుటుంబం యాజమాన్యంలో నడుస్తోంది. నేషనల్ హెరాల్డ్ అప్పులను గాంధీ కుటుంబం  కాంగ్రెస్ నిధులతో తీర్చిందని బిజెపి నాయకుడు సుబ్రమణ్య స్వామి ఆరోపిస్తున్నారు. ఆయన ఈ విషయంలో కోర్టులో కేసు కూడా వేశారు. కాంగ్రెస్ నాయకత్వం అవినీతికి నేషనల్ హెరాల్డ్ కేసు మచ్చుతునక ఆని బిజెపి ఆరోపిస్తున్నది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఆదేశంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది.

జనవహరా‌లాల్ నెహ్రూ తాను ప్రధాని కాకముందు నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించారు. 56 ఏళ్లుగా నడుస్తున్న తీజులు రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నేషనల్ హెరాల్డ్ కోర్టులో సవాలు చేసింది. ప్రభుత్వం పక్షాన తీర్పు చెప్పిన కోర్టు రెండు వారాలలో భవనం ఖాళీ చేయాల్సిందిగా నేషనల్ హెరాల్డు యాజమాన్యాన్ని ఆదేశించింది.