NewsOrbit
న్యూస్ హెల్త్

క‌రోనా కొత్త ల‌క్ష‌ణం.. ఈ విషయం గురించి తెలిస్తే షాక్ అవుతారు!

అరే.. ఈ క‌రోనాకు వాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియ‌దు కానీ అది వ‌చ్చే వ‌ర‌కూ భ‌యం త‌ప్పేట‌ట్లు లేదు. ఈ క‌రోనా వ‌ల్ల బ‌య‌ట అడుగు పెట్టాలంటేనే వ‌ణుకు వ‌స్తోంది. అత్య‌వ‌స‌రంగా బ‌య‌ట‌కు పోతే ఎక్క‌డ ముట్టుకోవాల‌న్నా భ‌యమే. అంత‌లా వేధిస్తున్న ఈ వైర‌స్ రోజుకో కొత్త రకంగా జనాన్ని భ‌య‌పెడుతూ వ‌స్తోంది.

ఇక విష‌యానికి వ‌స్తే.. మీ చెవిలో ఏవైనా వింత‌గా సౌండ్స్ వ‌స్తున్నాయా..? లేక‌ రింగ్ మని మోగుతుందా..? ప‌దేప‌దే లోప‌ల ఏదో వింత శ‌బ్దం వినిపిస్తుందా..? అయితే మీరు జాగ్ర‌త‌గా ఉండాల్సిందే. ఇది క‌రోనా కు కొత్త ల‌క్ష‌ణం అయ్యే అవ‌కాశం ఉందంట‌. క‌రోనా వ‌చ్చిన చాలామందిలో ఈ స‌మ‌స్య ఉంటుంద‌ని, దీంతో త‌ల కంపించిన‌ట్లు కూడా అనిపిస్తే.. అది క‌రోనా ల‌క్ష‌ణ‌మేన‌ని ఒక కొత్త రీసెర్చ్ చెబుతోంది. అందుకే మీకు కూడా అలా ఉంటే జాగ్ర‌త‌గా ఉండ‌టం చాలా అవ‌స‌రం.

మ‌న చెవిలో రింగ్ మని వ‌చ్చే సౌండ్ ను టిన్నిట‌స్ అంటారు. ఈ విధ‌మైన సౌండ్ క‌రోనా సోకిన వారిలో ఎక్కువ‌గా ఉంటుంద‌ని, దానితో పాటు త‌ల ప‌ట్టేసిన‌ట్టు కూడా ఉంటుందని ఈ రీసెర్చ్ చెబుతోంది. అయితే ఇలాంటి సౌండ్ వినిపించే వారు ప్ర‌పంచ జ‌నాభాలో 12% నుంచి 30 శాతం వ‌ర‌కూ ఉంటార‌ని ప‌రిశోధ‌కులు తెలుపుతున్నారు. దీనికి కార‌ణాలు వెతికే ప‌నిలో సైంటిస్టులు ఒక రీసెర్చ్ చేశారు. అందులో కొన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

పైకి క‌నిపించ‌ని వ్యాధుల వ‌ల్ల ఇలాంటి సౌండ్లు వ‌స్తాయ‌ని చెబుతున్నారు. ఇలాంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు కోలుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌ని పేర్కొంటున్నారు. కొన్నాళ్ల పాటు అలా చెవిలో విచిత్రమైన సౌండ్ వ‌స్తూనే ఉంటుంద‌ని తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన రీసెర్చ్ వివ‌రాల‌ను పోయిన నవంబర్ 5న వెలువ‌రించారు. అంగిలా రస్కిన్ యూనివర్శిటీకి చెందిన సైంటిస్టులు ఆధ్వ‌ర్యంలో బ్రిటన్ టిన్నిటస్ అసోసియేషన్, అమెరికన్ టిన్నిటస్ అసోసియేషన్ క‌లిసి ఈ రీసెర్చు చేసిన‌ట్లు వారు పేర్కొన్నారు.

ఈ రీసెర్చ్ లో 48 దేశాలకు చెందిన వారు పాల్గొన్నారు. అందులో 3,103 మందికి ఈ స‌మ‌స్య ఉన్న‌ట్లు గుర్తించారు. అలాగే క‌రోనా సోకిన 40 శాతం మందిలో ఈ స‌మ‌స్య ఉన్న‌ట్లు గుర్తించారు. అలాగే ఈ స‌మ‌స్య క‌రోనా సోక‌డానికి ముందు ఉంటాయ‌ని పేర్కొన్నారు. అలా రానురాను ఎక్కువైతున్న‌ట్లు తెలిపారు. క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత కూడా ఈ స‌మ‌స్య ఉంటుంద‌ని తెలిపారు. ఇదే కాకుండా ఒత్తిడికి లోనయ్యే వారిలో కూడా ఈ స‌మ‌స్య ఉన్న‌ట్లు తెలుపుతున్నారు. మీకు గాను ఈ స‌మ‌స్య ఉన్న‌ట్లు అనిపిస్తే.. డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి టెస్ట్ చేయించుకోవడం మాత్రం మ‌ర్చిపోవ‌ద్దు.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?