COVID 3rd wave: ఏపీలో మొదలై పోయిన 3వ కరోనా వేవ్

Share

COVID 3rd wave:  ప్రస్తుతం కరోనా సెకండ్ తాకిడి కొద్దికొద్దిగా సాగుతున్న నేపథ్యంలో నిబంధనలు కూడా సడలించడంతో ప్రజలంతా కొద్దిగా ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే మూడవ వేవ్ తప్పకుండా ఉంటుందని అందులో చిన్నారులు ఎక్కువగా వైరస్ బారినపడతారని శాస్త్రవేత్తలు నిర్ధారించిన విషయం తెలిసిందే. మొదటి రెండు వేవ్ ల మధ్య దాదాపు ఒక ఐదు నుండి ఏడు నెలల గ్యాప్ వచ్చింది.

 

COVID 3rd wave started in AP GGH
COVID 3rd wave started in AP GGH

ఇప్పుడు మూడో వేవ్ కూడా కనీసం ఒక మూడు లేదా నాలుగు నెలల గ్యాప్ వస్తుందని పరిశోధకుల అంచనా వేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కరోనా మూడవ వేవ్ అప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది. ఒక్కసారిగా ఈ రోజు దాదాపు 20 మంది చిన్న పిల్లలు కరోనా లక్షణాలతో గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో అడ్మిట్ కావడం జరిగింది.

దీంతో గుంటూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి కోవిడ్ మూడవ వేవ్ ను నిలువరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే ఆసుపత్రిలో మరొక 120 జనరల్ బెడ్లు, 25 ఐసీయూ బెడ్లు, సరిపడా వెంటిలేటర్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు… పిల్లలందరికీ అవసరమైన ఔషధాలను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.

ఇక పిల్లలకి కోవిడ్ రావడంతో తమ సిబ్బంది మొత్తం అప్రమత్తం అయినట్లు చెప్పారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎటువంటి లక్షణాలు వచ్చినా వెంటనే టెస్ట్ చేయించి ఆసుపత్రిలో చేర్చాలని చెప్పారు. గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ మెడికల్ మరియు ఆరోగ్య డిపార్ట్మెంట్ అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించి ప్రతి ఒక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ లో మందులు పరికరాలను సమకూర్చాలని తెలిపారు. అలాగే చిన్న పిల్లలకు కూడా కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.


Share

Related posts

‘లింగమనేనికి ఆర్‌కె సవాల్!’

somaraju sharma

వెంకీ సినిమాను శర్వానంద్ లాగేసుకున్నాడా? ఇదెక్కడి దారుణం??

sowmya

అమెరికా మాల్‌లో బాలివుడ్ ఫ్లాష్ మాబ్

somaraju sharma