NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

COVID third wave: రోజుకి 1500 కోవిడ్ కేసుల నుండి 0 కి నెంబర్ తీసుకొచ్చిన మహారాష్ట్ర ఐఏఎస్ సందీప్ స్ట్రాటజీ చుస్తే చప్పట్లు కొట్టాల్సిందే..! 

COVID third wave fear is no more with IAS Sandeep in charge

COVID third wave: భారతదేశం కోవిడ్ క్యాపిటల్ గా మారిన మహారాష్ట్ర రాష్ట్రంలో బండారా జిల్లా సెకండ్ వేవ్ లో అల్లాడిపోయింది. రోజుకి దాదాపు 1500 కేసులు ఈ ఒక్క జిల్లా నుండి నమోదయ్యాయి. అయితే రోజుకి ఇన్ని వందల కేసులనుండి సున్నా కేసులకి ఆ కౌంట్ తగ్గించిన ఘనత ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ కదమ్ కే చెందుతుంది. అతను ప్రవేశపెట్టిన మూడు దశల స్ట్రాటెజీ అసామాన్యం. 

 

COVID third wave fear is no more with IAS Sandeep in charge

సెకండ్ వేవ్ సమయంలో చిన్నచిన్న పల్లెటూర్లలో కూడా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బండారా జిల్లాలో దాదాపు 13 లక్షల జనాభా. 800 గ్రామాల్లో కోవిడ్ కేసుల నెంబర్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఆగస్టు ఆరవ తారీఖుకి మాత్రం కోవిడ్ ఫ్రీ జిల్లాగా బండారా కొత్త రికార్డు సాధించడం వెనుక ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ ప్రతిభ ఉంది. 

ఒక్క రోజులోని 35 మంది చనిపోయారు… 

ఆగస్టు 2020లో కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో సందీప్ జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. ఇక ఏప్రిల్ లో కేసుల సంఖ్య ఆమాంతం పెరిగిపోయింది. మొత్తం మధ్యమ భారతదేశంలోనే బండారా జిల్లా అత్యధిక కేసులతో అల్లాడిపోతోంది. 12 ఏప్రిల్ రోజున 56 కొత్త కేసులు నమోదు కావడమే కాకుండా మే ఒకటో తారీఖున 35 మంది మరణించడం జరిగింది. దీంతో వెంటనే రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల సరిపోక బడులు, పెళ్లి మండపాలు, కమ్యూనిటీ సెంటర్లు, ప్రభుత్వ భవనాలన్నీ కోవిడ్ సెంటర్లుగా మార్చారు. 

వెంటనే సందీప్ రంగంలోకి దిగి కేవలం మూడు నెలల్లో అన్ని గ్రామాల నుండి కోవిడ్ ని తరిమికొట్టే బాధ్యతలు చేపట్టారు. ఈ దశలోనే భాగంగా మైక్రో కంటెంట్మెంట్ అనే పద్ధతిని తీసుకువచ్చారు. అసలు ఆగని టెస్టింగ్ ప్రక్రియ చేపట్టి పాజిటివ్ పేషంట్ల ను గుర్తించడం… వెంటనే వారికి చికిత్స అందించడం వంటివి చేయడం వల్ల జిల్లాలో వెంటనే రిజల్ట్ వచ్చింది. 

టెస్టింగే మూలం

మొదటి స్టెప్ లో భాగంగా ప్రతి గ్రామాన్ని సందర్శించి భారీ స్థాయిలో టెస్టింగ్ జరిపారు. ఈ దశలో కొవిడ్ పాజిటివ్ కాంటాక్ట్స్ ని గుర్తించడానికి వారికి ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. అందుకని అతి భారీస్థాయిలో టెస్టింగ్ చేయడం ఒకటే తమ ముందు ఉన్న పరిష్కారమని గుర్తించారు. ఇక రెండవ లో భాగంగా ఎప్పుడైతే పాజిటివ్ రేటు 52% పెరిగిందో ప్రమాదం ఉన్న ఏరియాలు అన్నింటినీ ఐసోలేషన్ జోన్లుగా ప్రకటించేశారు. దీంతో రెండు మూడు వారాల పాటు అంతా ఐసోలేషన్ కి వెళ్ళిపోయారు. దీంతో పెరుగుదల గణనీయంగా తగ్గిపోయింది. 

IAS Sandeep Kadam

ఆ తరువాత వచ్చింది ఒక్క పేషెంట్ పాజిటివ్ అని తెలిసినా కూడా దానిని మైక్రో కంటెంట్మెంట్ ప్రకటించేవారు. దీంతో పరిసరాల్లో ఉండే ప్రజలకు కోవిడ్ సోకకుండా ఆపేశారు. ఇక రాత్రి పగలు తేడా లేకుండా ఆఫీసర్స్ అందరికీ సందీప్ ఉత్తర్వులు జారీ చేశారు. మైక్రో కంటైన్మెంట్ ఏరియాల్లో చుట్టుపక్కల ప్రజలు కూడా వీరికి సహకరించేలా ఒప్పించారు. ఇలా మూడు స్టెప్పుల పద్ధతి పాటించడంతో కేవలం రెండు నెలల్లోనే రోజుకి వంద కేసులకి మాత్రమే కోవిడ్ కౌంట్ ని తగ్గించారు. అయినప్పటికీ మీరు మాత్రం విశ్రాంతి చెందలేదు. 

COVID third wave: ప్రభుత్వం విశ్రాంతి చెందినా…. 

ఆ దశలో ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు తీసివేసింది. వెంటనే అప్రమత్తమైన ఐఏఎస్ సందీప్ బృందం చివరి వరకూ ఈ ప్రక్రియ మాత్రం ఆపలేదు. పది, పదిహేను పాజిటివ్ పేషంట్స్ ఉన్న ఏరియాలని మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తూ వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ఇలా ఈ నెల మొదటి కి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కావడం లేదు. థర్డ్ వేవ్ జాడలు కనిపిస్తున్నా… ఈ జిల్లా ప్రజలు మాత్రం ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నారు. 

అయితే సందీప్ మాట్లాడుతూ ప్రజలు రిలాక్స్ అయ్యారని… అయితే మన చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పుడు కేసులు పెరుగుతున్నందున ఖచ్చితంగా మాస్కులు ధరిస్తూ ఏ పరిస్థితిని అయినా ముందు హెల్త్ కేర్ వర్కర్లకి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఇలా ఎన్నో రోజులు జాగ్రత్తలు పాటించవలసిందే అని ఆయన తేల్చి చెప్పారు.

author avatar
arun kanna

Related posts

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju