న్యూస్ రాజ‌కీయాలు

Covid vaccine: రెండవ డోసు కి స్లాట్ దొరకట్లేదా? ఏం భయం లేదు

CoWin app
Share

Covid vaccine: ప్రస్తుతం వ్యాక్సిన్ కు భారతదేశంలో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కేంద్రం బ్లాక్ మార్కెట్లో ఇవి అమ్ముడుపోకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే అవకాశవాదులు ఇప్పటికే జనాలు దగ్గర వేలకి వేలు దండుకునేవారు. ఇదంతా పక్కన పెడితే 45 ఏళ్లు పైబడిన వారు రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకునేందుకు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు.

 

CoWin app
CoWin app

‘కోవిన్’ యాప్ లో ఫ్లాట్లు అంత సులభంగా అయితే స్లాట్లు లభించడం లేదు. అవి లభించినప్పటికీ చాలా రోజులు వ్యాక్సినేషన్ కోసం వేచి ఉండవలసి వస్తోంది. ఈ లోపల వైరస్ ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అని పొంచుకొని ఉంది .ఇక ఇలాంటి సమయాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురి అవ్వాల్సిన పనిలేదు అని పరిశోధనలు చెబుతున్నాయి.

ఎందుకంటే మొదటి డోసు వేయించుకున్న వారికి అప్పుడే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి యాంటీబాడీలు ఉత్పన్నం అవుతాయి అవి వైరస్ ను చాలావరకు నిలువరించడంలో తోడ్పడుతాయి అని తేలింది. మొదటి వేసుకున్న వారికి ఇన్ఫెక్షన్ రాదు అని చెప్పలేము కానీ వైరస్ సోకిన తర్వాత వారికి ప్రాణాపాయం ఉండే అవకాశం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.

ఇక ప్రస్తుతం భారత్ లో ఉన్న రెండు వ్యాక్సిన్ లలో కోవాగ్జిన్ వేసుకున్న వారైతే…. మొదటి డోసు పొందిన వారిలో మరణిస్తున్న వారి సంఖ్య చాలా అంటే చాలా తక్కువ. అలాగే కోవిషీల్డ్ విషయానికి వస్తే మొదటి డోసు వేసుకుంటేనే 48 శాతం మీ ప్రాణాలకు ముప్పు ఉండదు. ఇక ఏ వ్యాక్సిన్ అయినా కూడా మొదటి డోసు వేసుకునే వారికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ వారిలో చనిపోయిన వారి శాతం మరీ తక్కువ.

కాబట్టి మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ మొదటి డోసు వేయించుకున్నవారు నిర్భయంగా ఉండొచ్చు. వారికి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, వేరే రిస్కు కలిగించే వ్యాధులు లేకపోతే చాలు.


Share

Related posts

వైసీపీ కీలక నిర్ణయం.. ప్లీనరీలో ఎల్లుండి తీర్మానం

somaraju sharma

Yash : రాకింగ్ స్టార్ గజకేసరి టీజర్ తో అదరగొడుతున్నాడు..!!

bharani jella

భయంకరమైన నిజం.. 27 ఏళ్ల కిందనే బాలయ్య, చిరంజీవి ఉన్న విమానం క్రాష్.. తృటిలో?

Teja