Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ మూడవ డోసు గురించి వివరించిన డాక్టర్లు..! అసలు ఈ పరిశోధన దేనికంటే…

Covid Vaccine third dose necessity explained
Share

Covid Vaccine: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం దేశంలోని 9.6 శాతం భారతీయులు పూర్తిగా వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. భారతదేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మిగిలిన దేశాలలో అధిక శాతం జనాభా రెండు డోసులు వేయించుకున్నారు. అయితే ఇజ్రాయిల్ లాంటి కొన్ని దేశాలు మాత్రం మూడవ డోసు దిశగా సన్నాహాలు జరుపుతున్నారు. 

 

Covid Vaccine third dose necessity explained

ఇజ్రాయిల్ లో మొదలు..!

ఇజ్రాయిల్ దేశంలో మూడవ డోసు Pfizer వ్యాక్సిన్ వేసుకుంటే అది 86% ప్రభావవంతంగా పనిచేస్తుందని తేల్చారు. ఇక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు కూడా అస్ట్రాజెనెకా మూడవ డోసు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. అయితే దీనిపై డాక్టర్ వికాస్ మౌర్య, డాక్టర్ మలా కనేరియా, డాక్టర్ సునీల్ జైన్ మనం ఈ మూడు డోసులని తీసుకోవాలా లేదా… మన రోగనిరోధకశక్తి తీసుకుంటే ఎంతలా యాక్టివేట్ అవుతుంది అన్న విషయంపై వివరించారు.

మొదట ప్రశ్న ఏమిటంటే… అసలు మూడవ డోసు అవసరమా కాదా అనే విషయం గురించి కాదు. ప్రస్తుతం రెండు రోజులు వేసేందుకే పూర్తి జనాభాకు సరిపోయేంత వ్యాక్సిన్లు మన వద్ద ఉన్నాయా లేదా అన్నది. ఇక రెండు డోసులకు సరిపడా వ్యాక్సిన్ లు ఉన్నాయి అంటే కచ్చితంగా మూడవ డోసు వేసుకోవడం వల్ల మనకు వైరస్ నుండి మరింత బలం చేకూరుతుందని చెబుతున్నారు. 

Covid Vaccine: ఈ పరిశోధన ముఖ్యం..!

ఊపిరితిత్తులను ప్రభావితం చేసే వైరస్ లకు పనిచేసే వ్యాక్సిన్లు కొన్ని నెలలకి ఆ సామర్థ్యాన్ని కోల్పోతాయి. కాబట్టి కాలం గడిచే కొద్దీ బూస్టర్ డోసులు వేసుకోవాల్సిందే అని అంటున్నారు. అయితే మూడవ డోసు వ్యాక్సిన్… ముందుగా వేయించుకున్న రెండు డోసుల వ్యాక్సిన్ దే వేయించుకోవాలా… లేదా మిక్స్డ్ వ్యాక్సిన్ పేరిట వేరే వ్యాక్సిన్ తో కొత్త డోసు వేసుకోవాలా అన్న విషయంపై మాత్రం ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. 

డాక్టర్ కనేరియా చెబుతున్నది ఏమిటంటే…. పరిశోధన ప్రకారం వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఉండే యాంటీబాడీలు ఎనిమిది నుండి పది నెలల మధ్యలో తమ ప్రభావాన్ని కోల్పోయాయి. వయసు ఎక్కువ ఉన్నవారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు మాత్రం తర్వాత బూస్టర్ డోసు కచ్చితంగా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారికి మొదటి రెండు డోసుల వల్ల వచ్చే యాంటీబాడీల నుండి రోగనిరోధక శక్తి సరిపోదు అని అన్నారు. అలాగే హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు కూడా జనవరిలో వేయించుకున్న వ్యాక్సిన్ ప్రభావం కొద్దికొద్దిగా క్షీణిస్తోందని కాబట్టి ముందు వీరందరికీ మూడవ డోసు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 

Covid Vaccine third dose necessity explained 2

ఆ తర్వాత నిదానంగా ప్రతి ఒక్కరూ ఈ బూస్టర్ డోసుని తీసుకోవాలని చెప్పారు. అప్పుడు ఉన్న యాంటీబాడీలు మరింత యాక్టివేట్ అయి ఆ తర్వాత ఊపిరితిత్తుల నుండి ముక్కు, గొంతు దగ్గర కూడా రక్షణా ఇస్తాయని… అలా మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మరింత మెరుగవుతుందని చెప్పారు. 

వీరికి ఖచ్చితం?

ఇక సెప్టెంబర్-అక్టోబర్ లో మూడవ వేవ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నందున ఆ డెల్టా నుండి రక్షింపబడాలి అంటే కూడా ఈ మూడవ డోస్ అవసరం అవుతుందని చెప్పారు. అసలు వ్యాక్సినేషన్ వేయించుకోని వారు లేదా రెండు డోసులు వేయించుకున్న వారితో పోలిస్తే ఈ మూడవ డోస్ వేయించుకున్న వారికి అది మరింత రక్షణ ఇస్తుందని అంటున్నారు. ముఖ్యంగా 60 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసున్న వారు తీసుకుంటున్న, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వారిలో, కీమోథెరపీ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వీరు మాత్రం కచ్చితంగా బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని దీని వల్ల మేలు తప్ప ఎలాంటి కీడు ఉండదని తేల్చారు.


Share

Related posts

నిహారిక పెళ్ళికి ముందే బయటకి వచ్చిన ఒక ఫోటో… సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది.

Naina

టీఆర్ఎస్ నేత‌లకు షాక్ … మోదీ మ‌న‌సులో ఉండిపోయే నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్‌

sridhar

ఒకే సినిమాలో ప్రభాస్ అండ్ హృతిక్ రోషన్- ఇది బాహుబలి + ఆదిపురూష్ కి బాబులాంటి సినిమా?

Varun G