బుల్లి దూడకు జన్మనిచ్చిన ఆవు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

సాధారణంగా అవుకు దూడ పుడితే ఎలా ఉంటుంది? దాదాపు ఒక మీటర్ ఎత్తు, మీటరున్నర పొడవు కచ్చితంగా ఉంటుంది. కానీ, ఓ ఆవు బుల్లి దూడకు జన్మనిచ్చింది. దీని ఎత్తు కేవలం 15 అంగుళాలు,..ఇక పొడవు 22 అంగుళాలు మాత్రమే ఉంది. ఈ వింత ఘటన తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరులో చోటు చేసుకుంది. అత్యంత చిన్నగా ఉండే ఈ దూడను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. దీని ఎత్తు, పొడవు సాధారణ దూడల కంటే చాలా తక్కువగా ఉంది. ముత్యాల వీరభాస్కరరావుకు చెందిన ఒంగోలు ఆవుకు ఈ దూడ పుట్టింది.  దీన్ని చూసేందుకు చుట్టుపక్కల నుంచి జనం అతని పాక వద్దకు తరలివస్తున్నారు. ఇప్పటి వరకు ఇంత చిన్న దూడ పుట్టడం అరుదని పశుసంవర్థకశాఖ అధికారి తెలిపారు. జన్యుపరమైన లోపాల వల్లే ఇలా జరిగి ఉంటుందని తెలిపారు.