కెసిఆర్‌ సర్కార్‌పై సిపిఐ నారాయణ ఫైర్

హైదరాబాద్: కెసిఆర్ నియంతృత్వ పోకడ తగ్గించుకోకుంటే తన గొయ్యి తాను తవ్వుకున్నట్లైనని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ వ్యాఖ్యానించారు. ఆర్‌టిసి కార్మికుల సమ్మెపై శుక్రవారం ఆయన ఎన్‌హెచ్‌ఆర్‌సిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం లేదని అన్నారు. ఆర్‌టిసి కార్మికులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదని నారాయణ ప్రశ్నించారు. కెసిఆర్ మొండివైఖరి వల్ల కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆర్‌టిసి కార్మికులు నిర్వహిస్తున్న బంద్‌ను విజయవంతం చేయాలని నారాయణ పిలుపునిచ్చారు.