CPI Narayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీపీఐ నారాయణ సెటైర్లు..!!

Share

CPI Narayana: రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలతో టీడీపీ ఒక్కోసారి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం, ఆ తరువాత వేరువేరుగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి సీీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్ వేశారు. తిరుపతిలో అమరావతి రైతుల మహా పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో చంద్రబాబుకు అటు ఇటు సీపీఐ, బీజేపీ నేతలు కూర్చోవడం, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ నేత నారాయణ వేదికపై మాట్లాడుకోవడంపై తొలుత రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ, సీపీఐ ఉప్పు నిప్పుగా ఉన్నప్పటికీ సైధ్దాంతిక, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ అమరావతి రాజధాని విషయంలో మద్దతు ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో మొదటి నుండి తనకు స్నేహితుడు, ఆత్మీయుడు అని పేర్కొన్నారు. తమ మధ్య తగువులు, విభేదాలు ఉన్నాయని అన్నారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయనకు ఇష్టం ఉన్నప్పుడు పక్కన పెట్టుకుంటారు. ఆయనకు ఇష్టం లేనప్పుడు పక్కకు తోసేస్తుంటారని సెటైర్ వేశారు. అది రాజకీయ విధానం, ఆ రాజకీయ విధానాన్ని మేము తప్పుబట్టడం లేదన్నారు.

CPI Narayana comments on chandra babu

“అమరావతి అనేది అందరి ఐక్యత. రాష్ట్ర రాజధాని.1952 నుండి 56వరకూ క్యాపిటల్ బెజవాడ కావాలని తాము కోరుకున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకూ మాట మారలేదు, మడమ తిప్పలేదు, అప్పుడు, ఇప్పుడు ఒకే మాట మీద, అదే మాటపై ఉన్నామని అన్నారు. అమరావతి మంచి శిశువును కన్నది. ముచ్చటైన శిశువును కంటి ఆ శిశువును తీసుకువెళ్లి మోడీ చేతిలో పేడితే మోడీ ఆంధ్ర రాష్ట్రానికి అప్పగించారు. ఆ పసికందును ఇప్పటి ముఖ్యమంత్రి నరికి నరికి మూడు ముక్కలు చేసి మూడు ప్రాంతాల్లో పడేసి ఇదే రాజధాని అంటే ఆయన కంటే మూర్ఘుడు మరొకరు లేరు” అని అన్నారు. మహిళల కన్నీరు ఏపికి మంచిది కాదని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక రాజధాని లేని రాష్ట్రం మనదేనని తెలిపారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని అవమాన పరిస్థితికి ఈ ముఖ్యమంత్రి తీసుకువచ్చారని నారాయణ విమర్శించారు.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

60 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

5 గంటలు ago