CPI Narayana: సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో భూసమస్యలు పరిష్కారం కాకపోతే తుపాకులు చేతపడతామంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వరంగల్లు జిల్లా బాలసముద్రం ఏకశిలా పార్క్ వద్ద సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదల కు ఇండ్ల స్థలాలు కావాలని న్యాయబద్దంగా పోరాడుతున్నామని అన్నారు. ఆత్మగౌరవం కోసం సీపీఐ పోరాడుతోందని తెలిపారు.
Read More: Presidential Election 2022: కింకర్తవ్యం..? ‘దీదీ’ ఆహ్వానంపై ‘పీకే’తో కేసిఆర్ మంతనాలు
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అంశంలో ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకుంటామన్నారు. ఉంటే గుడిసెలో లేకుంటే జైలులో ఉంటామని నారాయణ స్పష్టం చేశారు. పేదలపై పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పేదల బాగోగులు చూడటం చేతగాక సీఎం కేసిఆర్ ఢిల్లీకి పోతున్నారని విమర్శించారు నారాయణ. సీఎం కేసిఆర్ కు చిత్తశుద్ది ఉంటే వరంగల్ లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ల్యాండ్ మాఫియాతో చేతులు కలుపుతోందని ఆరోపించారు. ల్యాండ్ మాఫియాకు ప్రభుత్వం సహకరిస్తే తమతో యుద్ధానికి సిద్దంగా ఉండాలని నారాయణ హెచ్చరించారు. ప్రభుత్వ భూములను కాపాడటానికి వస్తే తమపై దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. వరంగల్ పోరుగడ్డ, భూపోరాటానికి ఇక్కడే నాంది పలుకుతామని అన్నారు నారాయణ.
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…