మత ప్రాతిపదికన పౌరసత్వమేమిటి!?

Share

అమరావతి: మత ప్రాతిపదికన దేశ పౌరసత్వం ఇస్తామనడం దార్భగ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను విమర్శించారు.

కేంద్రం ప్రతిపాదిస్తున్న ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని వామపక్షాలు నిర్ణయించాయన్నారు. బిజెపి తన సొంత అజెండాను ప్రజలపై రుద్దుతోందని ఆయన ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ నేడు బిజెపి ప్రాపకం కోసం పాకులాడుతున్నారని రామకృష్ణ విమర్శించారు. రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అయోమయానికి గురి చేస్తున్నాయని అన్నారు. ఈ నెల 28న రాజధానిలో రైతులు, కూలీలు, ప్రజలతో సదస్సు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. 19న జరిగే నిరసనలో, 28న జరిగే సదస్సులో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.


Share

Related posts

Radhasaptami : రథ సప్తమి రోజున కొత్తబియ్యం తో పాటు కొత్త బెల్లం కలిపి ఇలా చేయండి!!

siddhu

అక్కడ ఫుడ్ ఆర్డర్లు అసలు రావట్లేదట.. కారణం అదే!

Teja

Bangaarraju: ‘బంగార్రాజు’ డ్రీమ్ ప్రాజెక్ట్ నాగార్జునకా లేక డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకా..?

GRK

Leave a Comment