NewsOrbit
జాతీయం న్యూస్

Blast In Cracker Factory: బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు .. 8 మంది కార్మికులు దుర్మరణం

Advertisements
Share

Blast In Cracker Factory: పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా తాయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు దుర్మరణం చెందగా, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పలువురు మహిళలు ఉన్నట్లు సమాచారం. బంగాల్ .. ఉత్తర 24 పరగణాల జిల్లా నీల్ గంజ్ ప్రాంతంలో ఉన్న మోష్ పోల్ లో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. కార్మికులు పని చేస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఘటనా స్థలంలో మృతదేహాల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని స్థానికులు తెలిపారు. మృతుల శరీర భాగాలు పక్కనున్న ఇళ్లపై, చెట్లపై కూడా పడ్డాయని చెప్పారు.

Advertisements

ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని బారాసత్ ఆసుపత్రికి తరలించారు. దత్తపుకుర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో బాణాసంచా తయారీని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్ని  సార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అండదండలతోనే ఆ ఫ్యాక్టరీలో బాణాసంచా తయారీ కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisements

విమర్శలపై ధీటుగా కౌంటర్ ఇచ్చిన టీటీడీ చైర్మన్ భూమన


Share
Advertisements

Related posts

Samantha: సమంత కోసం సెట్ మార్చేశారా..నిర్మాతలకు ఎంత నష్టం అంటే.?

GRK

Telangana : తెలంగాణలో ఇప్పుడు అస‌లు రాజ‌కీయ రంగు….

sridhar

Nelatadi: ఈ మొక్క ఎక్కడ కనిపించినా వేర్లతో సహా తెచ్చుకోండి.. ఎందుకంటే..

bharani jella