Tollywood : మల్టీస్టారర్స్ మీద క్రేజ్ పెరుగుతోంది..బడ్జెట్ కూడా అంతే పెటాల్సి వస్తోంది..!

Share

Tollywood : ఒకప్పుడు బాలీవుడ్ లో మల్టీస్టారర్లు విరివిగా తెరకెక్కేవి. అక్కడ మార్కెట్ భారీ స్థాయిలో ఉంటుంది. హిందీ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళు పెట్టే బడ్జెట్ ఎవరూ చర్చించుకోరు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, అమీర్ ఖాన్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, కత్రినా కైఫ్, కాజోల్, మనీషా కోయిరాల, ఐశ్వర్యా రాయ్, సైఫ్ అలీఖాన్, శిల్పా శెట్టి ..ఇలా భారీ కాస్టింగ్ తో సినిమాలు రూపొందిస్తున్నారు. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి బాలీవుడ్ లో కొనసాగుతున్న ఫార్ములానే. అక్కడ బాక్సాఫీస్ వద్ద సినిమాకే ప్రాధాన్యం ఇస్తారు.

craze for multi starer in tollywood-
craze for multi starer in tollywood-

కానీ తెలుగులో మల్టీస్టారర్ అంటే ఇక్కడ అభిమానులు ముందు గొడవలు పడటం మొదలు పెడతారు. మా హీరో ఎక్కువంటే మా హీరో ఎక్కువ అని వాదనలకి దిగుతారు. ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి రక రకాల చర్చలు..ట్రోలింగ్స్ మొదలవుతుంటాయి. మాకు లేని ఇగోస్ మీకెందుకు అని మన స్టార్ హీరోలు పలు సందర్భాలలో చెప్పుకొస్తున్నా ఎవరో కొందరు మాత్రం అవి కేర్ చేయకుండా ట్రోల్స్ కి దిగుతున్నారు. ఇంకా ఇలాంటి అభిమానులున్నారు. అయితే కాస్త ఇప్పుడిప్పుడే అభిమానుల మైండ్ సెట్ మారుతోంది. తమ అభిమాన హీరోలు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Tollywood : టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా భారీ మల్టీస్టారర్స్ కి ప్రాధాన్యం పెరుగుతోంది.

అందుకే టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా భారీ మల్టీస్టారర్స్ కి ప్రాధాన్యం పెరుగుతోంది. మన హీరోలు కూడా పాత్ర నచ్చితే ఏ హీరోతో నైనా సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇక్కడే బడ్జెట్ విషయం కూడా ప్రత్యేకంగా చర్చించుకోవాల్సి వస్తోంది. ఇద్దరు హీరోలుంటే బడ్జెట్ కూడా అదే స్థాయిలో ఉండాలి. కానీ ఇలా మల్టీస్టారర్స్ అన్నీ సక్సెస్ సాధించడం లేదు. దాంతో నిర్మాతకి మరో సినిమా తీసే అవకాశం దక్కడం లేదు. ఈ విషయంలో ఇప్పటి వరకు నిర్మాత నష్టాలు చూడకుండా హీరోలకు పాన్ ఇండియన్ క్రేజ్ తీసుకు వస్తుంది మాత్రం ఒక్క రాజమౌళినే. బాహుబలి తర్వాత కూడా ఆయన తారక్, చరణ్ లు హీరోలుగా ఆర్ఆర్ఆర్ చేస్తున్నారు. కానీ అందరూ ఈ సక్సెస్ చూస్తారా అనేది మరో రెండేళ్ళు ఆగుతే గానీ ఒక అంచనాకి రాలేము.


Share

Related posts

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై విజయసాయి ఘాటు వ్యాఖ్యలు..!!

somaraju sharma

సింగర్ సునీత రెండో పెళ్లి తర్వాత లేటెస్ట్ అప్ డేట్..!!

sekhar

బిల్లాని కలిసిన ‘బిల్లా’

Siva Prasad