Srimukhi: ఇటు స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తూనే అటు సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటాలని బాగా ట్రై చేస్తున్న వారిలో బబ్లీ బ్యూటీ శ్రీముఖి ఒకరు. అందానికి, పర్ఫార్మెన్స్ కి ఏమాత్రం తక్కువ కానీ శ్రీముఖి స్మాల్ స్క్రీన్ మీద చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇక్కడ విపరీతమైన పాపులారిటీ ఉంది. మధ్య మధ్యలో శేఖర్ మాస్టర్ లాంటి వారితో కలిసి చేస్తున్న హంగామా కూడా అమ్మడికి బాగా ప్లస్ అవుతోంది. ఇక గత ఏడాది బిగ్ బాస్ కి వెళ్ళొచ్చాక శ్రీముఖి రేంజ్ మరింతగా పెరిగిపోయింది. హీరోయిన్‌కి ఏమాత్రం తగ్గని క్వాలిటీస్ శ్రీముఖిలో ఉన్నాయి.
అందుకే శ్రీముఖి ఇప్పటికే పలు చిత్రాలలో నటించే అవకాశం అందుకుంది. సాధారణంగా బుల్లితెర మీద కనిపించేవారిని సినిమాలలోకి తీసుకోరనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. కానీ శ్రీముఖికి బాగానే అవకాశాలిస్తున్నారు. అంతేకాదు ఆమె ఇప్పటి వరకు చేసిన సినిమాలలో మంచి పేరే తెచ్చుకుంది. అల్లు అర్జున్ – త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా నటించి బాగా ఆకట్టుకుంది. అలాగే నేను శైలజ సినిమాలో రాం పోతినేనికి అక్కగా నటించి బాగానే పేరు తెచ్చుకుంది.
Srimukhi: ఇన్నాళ్ళు సినిమాల పరంగా శ్రీముఖికి ఇలాంటి కామెంట్స్ రాలేదు.
నేచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మాన్ సినిమాలో శ్రీముఖి చేసిన పాత్ర కూడా ఆమెకి బాగా పేరు తెచ్చింది. కానీ తాజాగా సీనియర్ నటులతో కలిసి చేసిన క్రేజీ అంకుల్స్ సినిమాకి మాత్రం నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. చాలామంది అనవసరంగా శ్రీముఖి ఈ సినిమా చేసిందని కొందరు ట్రోల్ చేస్తున్నారు. రిలీజ్ కి ముందే కొందరు ఆడవాళ్ళు ఈ సినిమా మీద మండిపడ్డారు. ఇన్నాళ్ళు సినిమాల పరంగా శ్రీముఖికి ఇలాంటి కామెంట్స్ రాలేదు. కానీ క్రేజీ అంకుల్స్ మాత్రం తనకి బాగా మైనస్ అయిందనే మాట వినిపిస్తోంది. మరి ఇప్పటి నుంచైనా ఆమె ఎంచుకునే క్యారెక్టర్స్ పేరు తెచ్చేవి ఎంచుకుంటుందో లేదో చూడాలి.