NewsOrbit
న్యూస్

జగన్ ఆప్తుడు …జర్నలిస్టు తోపుగాడి మీద తీవ్ర విమర్శలు!

ప్రజాధనాన్ని అప్పడంలా నమిలేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ సలహాదారు సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

criticisms are coming on a serious level on amar
criticisms are coming on a serious level on amar

ఆయనకు పనేమీ ఉండదు. పేరుకు సలహాదారు.నెలకు దాదాపు నాలుగు లక్షల రూపాయల వరకు ఆయనకు ముడుతోంది.ఆయన చేసేది మహా అయితే అప్పుడప్పుడు పత్రికా ప్రకటనలు విడుదల చేస్తుంటారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చిన సందర్భంలో మాత్రమే అమర్ స్పందించి వివరణ తరహా లో వెటకారం తో కూడిన ప్రకటనలు జారీ చేస్తారు.ఆయన చేసేదేమీ లేక పోయినా ఎవరైనా ఏం చేస్తున్నావని ప్రశ్నిస్తే ఎదురుదాడి మాత్రం చేస్తాడు.సిఎం జగన్ సలహాదారుల్లో ఒకరైన సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి రాజీనామా చేసిన నేపథ్యంలో సిపిఐ రామకృష్ణ అందరూ సలహాదారుల గురించి ప్రస్తావిస్తూ వారంతా ఐరావతాలు అని,తెల్ల ఏనుగులని విమర్శించిన నేపథ్యంలో మిగతా వారికి ఏమీ బాధ కలగలేదు కానీ అమర్ కి మాత్రం పొడుచుకు వచ్చింది.

ఆయన ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలను వెటకారం చేస్తూ వివరణిచ్చారు .వాళ్లకు ఓట్లు సీట్లు ఉండవు గానీ నోరు ఉందని విమర్శలు మాత్రం చేస్తుంటారని అమర్ ఎద్దేవా చేశారు. సలహాదారులు ప్రభుత్వానికి సలహాలు ఇస్తూనేఉంటారని అయితే అవి వీధి ప్రదర్శనలు లేదా నాటకాల రూపంలో ఉండవని అమర్ కమ్యూనిస్టులను ఎగతాళి చేశారు.అయితే అమర్ ప్రకటన ను జర్నలిస్టు సంఘాలే కౌంటర్ చేస్తున్నాయి.దేవులపల్లి అమర్ సిఎం జగన్ చెవిలో ఎవరికీ వినిపించకుండా కనిపించకుండా సలహాలిస్తూ వస్తున్నారా అని వారు సెటైర్ వేశారు!ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజాధనం దుర్వినియోగమైతే నిలదీసి అడగడం ప్రతిపక్షాల పాత్ర అనడంలో ఏ సందేహమూ లేదు.

అదే పని సిపిఐ రామకృష్ణ చేస్తే అసలు విషయాన్ని మరుగునపరిచి అమర్ కమ్యూనిస్టులపై ఒంటికాలిపై లేచారు.నెలకు నాలుగు లక్షల రూపాయలు అమర్ జీతభత్యాలు పొందడం లేదా? ఇందుకు ఆయన జేస్తున్న పనేమిటని జర్నలిస్టు సంఘాలే ప్రశ్నిస్తున్నాయి!అసలు తెలంగాణకు చెందిన అమర్ కి నెలకు అంత జీతం ఇవ్వడం ఏపీ సీఎం జగన్ చేసిన పెద్ద తప్పిదం అన్న కామెంట్స్ వస్తున్నాయి!తెలంగాణ ఉద్యమంలో అమర్ ఆంధ్రుల్ని నానా విధాలుగా కించ పరిచారు.ఆయన సోదరులు నడిపే ప్రజాతంత్ర వారపత్రికను తెలంగాణ ఉద్యమానికి అంకితం చేశారు.

అలాంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును జగన్ జీతభత్యాలుగా ఇవ్వడం ఏమిటంటునారు!ఇన్ని సుద్దులు చెప్పే అమర్ ప్రజాతంత్ర లో పనిచేసిన జర్నలిస్టులకు జీతాలు కూడా ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయి.ఎదుటి వారికి మాత్రం శ్రీరంగ నీతులు చెప్పే అమర్ తాను మాత్రం ఏవీ పాటించడు!నాటి చంద్రబాబు మొదలు నేటి జగన్ వరకు ఆయన అందరు సిఎంలను మెప్పించి ఒప్పించి తన పబ్బం గడుపుకుంటున్న విషయం అందరూ చూస్తూనే ఉన్నారు! ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ ఉంటుంది!

author avatar
Yandamuri

Related posts

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju