NewsOrbit
న్యూస్

భారీ వర్షాలు, వరదలకు ఏపీలో పంట నష్టం ఎంతంటే..?

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

రాష్ట్రంలో వాయుగుండం కారణంగా మూడు రోజులుగా కురిసిన వర్షాలు, భారీ వరద కారణంగా వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టంపై యుద్ధ ప్రాతిపదికన ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్ననే వర్షాలు వరదల పై అధికారులతో సమీక్ష జరిపిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, మినుము, చెఱకు తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మొత్తం తొమ్మిది జిల్లాల్లో 71,821 హెక్టార్ల లోని పంట నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి అందించింది. ఉదయ గోదావరి, విశాఖ, కృష్ణాజిల్లాలో అత్యధికంగా పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. తొమ్మిది జిల్లాల్లో 24 రకాల పంట లకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది.

వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం… వరి 54,694, పత్తి 12,047, మినుము 1600, చెరకు 310, వేరుశనగ 836 హెక్టార్ల పంట దెబ్బతిన్నట్లు పేర్కొన్నది. కడప జిల్లాలో ఇసుక మేట వేసిన కారణంగా 476 హెక్టార్లలో, భూమి కోత కారణంగా 53 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలో పేర్కొన్నది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 29, 943, పశ్చిమ గోదావరి జిల్లాలో 13,976, కృష్ణాజిల్లాలో 12,466 హెక్టార్లలో పంటలు పంటలు దెబ్బతినగా, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 158 హెక్టార్లలో పంట నష్టం జరిగింది.

author avatar
Special Bureau

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju