Current Bill: అస్తమానము ఫ్రిజ్ తలుపు తెరుస్తూ మూస్తూ ఉండటం వంటివి చేయకూడదు. వేడివేడిగా లేదా వెచ్చగా ఉన్న ఆహార పదార్థాలు ఫ్రిజ్లో పెట్టకూడదు. స్మార్ట్ ఫ్రిజ్ ను ఎంచుకుంటే కరెంట్ బిల్లు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వాషింగ్ మెషిన్ లో లోడ్ కు మించి బట్టలు వేయటం సరైన పద్దతి కాదు.ప్రతి మూడు నెలలకు ఒకసారి అయినా మిషన్ సరిగ్గా పని చేస్తుందో లేదో చూసుకుంటూ ఉండాలి.
ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న వాషింగ్ మెషిన్ ని వాడండి . ఎందుకంటే వాటికి కరెంట్ , నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. మైక్రో ఓవెన్ వాడే వాళ్లు వంటకాన్ని బట్టి టైమ్ ను పెట్టుకోవాలి. ఒకసారి మైక్రో ఓవెన్ ని ఆన్ చేశాక అస్తమానము ఓపెన్ చేసి చూడకూడదు. అలా చుస్తే, టెంపరేచర్ తగ్గిపోయి,అది మళ్లీ వేడెక్కాలంటే ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది. అసలు చిన్నచిన్న వంటలకు ఓవెన్ వాడకపోవడమే మంచి పద్దతి
ఒక గదిలోనుంచి బయటకు వచ్చినప్పుడు, లైట్, ఫ్యాన్ వంటివన్నీ ఆపేశారా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. వీటన్నిటితో పాటు కరెంట్ బిల్ సమయానికి కట్టేయండి. అలా కట్టడం వలన లేట్ ఫైన్ పడదు కాబట్టి బిల్ కూడా తగ్గుతుంది.ఈ టిప్స్ పాటించడం ద్వారా కరెంట్ బిల్లు బాగా తగ్గే విధం గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నవారంతా బాధ్యత గా ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయి. కాబట్టి కొంచెం కష్టం అయినా కూడా వీటిని అలవాటు చేసుకుంటే ఎప్పటికీ పనికి వస్తుంది అనడంలో సందేహం లేదు