current safety: షాక్ తగిలిన వెంటనే తాకకూడదు.భారీ ఓల్టేజ్ తో కాకుండా ఓ మోస్తరు కరెంట్ షాక్ తగిలి ప్రమాదం లో ఉన్నవారిని ఎలా కాపాడుకోవచో తెలుసుకుందాం కరెంట్ షాక్ తగిలినవారిని చూసి కంగారు పడి రక్షిద్దాం అన్న ఉద్దేశ్యం తో కరెంట్ షాక్ తగిలిన వెంటనే వారిని తాకకూడదు. దీనికి కారణం వారిలో అధికం గా కరెంటు సప్లై అవుతుంటుంది. దీనివలన వారిని పట్టుకున్న వారికి కూడా ప్రమాదం జరిగేఅవకాశం ఉంది.షాక్ కి గురైన తర్వాత కూడా విద్యుత్ వైర్‌ను, స్విచ్‌ను ఇంకా అలాగే పట్టుకుని ఉంటే వారిని ముందుగా ఆ కరెంట్ నుంచి వేరు అయ్యేవిధం గా చేయాలి. దాని కోసం ఎండిపోయిన కర్రలు, గ్లాస్, రబ్బర్, వంటి వస్తువులను వాడడం తో పాటు మెయిన్ ఆఫ్ చేయడం వంటివి జరిగిన తర్వాత కరెంట్ నుంచి షాక్ తగిలిన వారిని విడదీయాలి.
current safety: ఆంబులెన్సును పిలవడం
కరెంటు షాక్ కొట్టి ప్రాణాలకు ముప్పు కలిగే వారికి వెంటనే మెడికల్ ట్రీట్ మెంట్ అందేలా చేస్తే వారిని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. దీని కోసం ఆలస్యం లేకుండా వెంటనే ఆంబులెన్సును పిలవడం లేదా ఏదైనా వాహనంలో దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లిపోవాలి. దీని వల్ల కరెంట్ షాక్ కొట్టడం వలన అయిన గాయాలకు వెంటనే ట్రీట్ మెంట్ జరిగి వారు ప్రాణాపాయ స్థితికి వెళ్లకుండా కాపాడుకోవచ్చు.
కరెంటు షాక్ కొట్టి వల్ల బాగా కాలి గాయాలైన చోట చల్లని నీటితో కడగాలి.
ఒక వేళా కరెంట్ షాక్ తగిలినవారు మూర్ఛ పోతుంటే వారిపై వేడిగా ఉండే దుప్పటి లేదా కోట్ లాంటివి ఏవైనా కప్పి ఉంచితే వారి శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.
కృత్రిమ శ్వాస
విద్యుత్ షాక్ కొట్టిన వారికి శ్వాస సరిగ్గా అందక పొతే, కృత్రిమ శ్వాసను నోటితో అందేలా చేయడం తో పాటు గుండెపై రెండు చేతులతో ఒత్తుతూ సీపీఆర్ కూడా చేయాలి.
ఇలాంటి పరిస్థితులలో వెన్నెముకకు బాగా గాయాలైతే తల, మెడ కదపకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. దీంతో నష్టాన్ని కాస్త తగ్గించుకోవచ్చు.
షాక్ కొట్టడం వల్ల గాయాలై రక్తస్రావం అవుతుంటే,శుభ్రమైన గుడ్డతో గాయాలకు కట్టు కడితే రక్త స్రావం తగ్గుతుంది.