హానీట్రాప్: కిలాడీ ఎయిర్ హోస్టెస్ అరెస్టు

హైదరాబాద్: హానీ ట్రాప్ కేసులు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రముఖులను అందాలతో ఎరవేసి ముగ్గులోకి దింపడం, తర్వాత వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఈ తరహా నేరం ఒకటి వెలుగులోకి వచ్చింది.

కనిష్క అనే ఓ ఎయిర్ హోస్టెస్ ఒక వ్యాపారవేత్తకు వల వేసి లక్షలు దండుకుంది. తన అందాలతో వ్యాపార వేత్తను ముగ్గులోకి దింపింది. ఆ వ్యాపారవేత్తకు తెలియకుండా సెల్ ఫోన్ ‌ద్వారా రాసలీల దృశ్యాలను రికార్డు చేసింది. ఆ తరువాత ఆమె భర్త విజయకుమార్ సహాయంతో ఆ వ్యాపారవేత్తను రిసార్ట్‌కు పిలిపించి పిస్టల్‌తో బెదిరించడంతో 20 లక్షలు సమర్పించుకున్నాడు. అంతటితో ఆగకుండా మరో కోటి రూపాయలకు బాండ్ పేపరు రాయించుకున్నారు. దీనిపై బాధిత వ్యాపారవేత్త సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే ఆ కిలాడీ మరో ఎన్ఆర్‌ఐని కూడా టార్గెట్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. కనిష్కతో పాటు ఆమె భర్త విజయకుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.