Cyberabad Police : సైబరాబాద్ Cyberabad Police నగరంలో అతి పెద్ద సమస్య ట్రాఫిక్ అని అందరికీ తెలుసు. దీంతో చాలావరకు వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఎవరికివారు వెళ్ళి పోతూ ఉంటారు. ఇలాంటి తరుణంలో హైదరాబాదులో హెల్మెట్ లేకుండా బండి నడిపే టూ వీలర్స్ వాహనదారులకు పర్మినెంట్గా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే రీతిలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త డిసిషన్ తీసుకున్నారు. మోటారు వాహనాల సవరణ చట్టం 2019 సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని తాజాగా ప్రకటించారు.
హెల్మెట్ లేకుండా మొదటి సారి ప్రయాణిస్తే పోలీసులకు పట్టుబడితే ఫైన్ కట్టాలి ఉంటుందని, ఆ తర్వాత మూడు నెలల లోపు రెండోసారి కూడా దొరికితే పూర్తిగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత అధికారులకు సిఫార్సు చేసే రీతిలో సరి కొత్త రూల్ సైబరాబాద్ పోలీసులు తీసుకోవటం జరిగింది. ఒక్క డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మాత్రమే కాకుండా వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని అవి కూడా నాణ్యమైన హెల్మెట్ అయి ఉండాలని ఖచ్చితంగా వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలను పాటించాలని కోరారు. ఈ విధంగా సహకరించటం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మాత్రమే కాక చలానా నుండి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక సరికొత్త షార్ట్ వీడియో ను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రిలీజ్ చేశారు.