Teja : టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ మూవీ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. ఓ స్టార్ ప్రొడ్యూసర్ కి వారసుడు, స్టార్ హీరో రానాకి సోదరుడు.. స్టూడియో యజమాని, దశాబ్ధాల పాటు సినీరంగంలో బలంగా పాతుకుపోయిన మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడి మనవడు..దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ నిజంగా ఇస్తున్నాడా.. లేదా? అనే సందేహాలు కలిగేలా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఫస్ట్ మూవీని సింపుల్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. మీడియా వారికి కూడా అంతగా సమాచారం లేకుండా ఇలా మూవీ లాంచ్ చేయడం అంటే కాస్త షాకవ్వాల్సిన విషయమే. ఇప్పుడు ఇదే ఒక హాట్ టాపిక్ గా మారింది.

తేజ దర్శకత్వంలో అభిరామ్ నటించబోతున్నాడని ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతోంది. ఇక గత కొన్నాళ్ళుగా స్క్రిప్టు వర్క్ జరుగుతోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇలా సడన్ గా ప్రాజెక్ట్ లాంచ్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. తాజాగా ఈ సినిమాను పూజాకార్యక్రమాలతో అభిరామ్ మూవీ స్టార్ట్ చేశారు. రానా తర్వాత ఈ ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కాబట్టి అందరిలోనూ ఆసక్తి, అంచనాలు బాగా నెలకొన్నాయి. ఇప్పటికే వెంకటేశ్, రానా స్టార్స్‌గా వెలుగుతున్నారు. ఇప్పుడు ఈ యంగ్ హీరో రాబోతున్నాడంటే ఎలాంటి స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటాడో అని టాక్ మొదలైంది.
Teja : ‘అహింస’ అనే టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఇక ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే అభిరామ్ దగ్గుబాటిని తండ్రి సురేష్ బాబు స్వయంగా లాంచ్ చేయడం లేదు. ఆయనకి అత్యంత సన్నిహితుడు, బాగా నమ్మకస్తుడు..ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ కి ఆ బాధ్యతలు అప్పగించారు. పెద్ద నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తుండటం మరో ఆసక్తికరమైన విషయం. చాలా కాలం తర్వాత తేజ – ఆర్ పి పట్నాయక్ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ఖచ్చితంగా మ్యూజికల్ గా పెద్ద హిట్ అని చెపుకుంటున్నారు. ‘అహింస’ అనే టైటిల్ తో యాక్షన్ థిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.