Daggubati Abhiram : దగ్గుబాటి అభిరామ్ హీరోగా లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అధికారకంగా ప్రకటించారు. తేజ కొత్త హీరోలను లాంచ్ చేయడంలో సిద్దహస్తుడు. డెబ్యూ హీరోలకి ఆయనది లక్కీ హ్యాండ్. ఆయన పరిచయం చేసిన హీరో, హీరోయిన్స్ సహా మిగతా టెక్నీషియన్స్ అందరూ స్టార్స్ గా వెలుగుతున్నారు. ఇప్పటికే కొన్ని వందల మందిని తన సినిమాల ద్వారా పరిచయం చేశాడు. ఇప్పుడు దగ్గుబాటి హీరో వంతు వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి.కిరణ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆర్పీ పట్నాయక్ అంతగా కనిపించడం లేదు. మళ్ళీ తేజ తో ఆర్పీ పట్నాయక్ జతకట్టడం ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ మూవీకి ‘అహింస’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రీసెంట్ గా ఈ మూవీని ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా హైదరాబాద్ లో ప్రారంభోత్సవం జరిపారు. కాగా తాజాగా అభిరామ్ డెబ్యూ మూవీ కోసం మేకర్స్ ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారు. మధ్యప్రదేశ్ లోని పన్నా అడవుల్లో చిత్ర దర్శకుడు తేజ, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ సంగీత చర్చలు ప్రారంభించారు.
Daggubati Abhiram : తేజ – ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ గా పెద్ద హిట్ అయ్యాయి.
తాజాగా దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఆర్పీ పట్నాయక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతేకాదు ఈ కాంబోతో సంగీతంలో బ్యాంగ్ ప్రారంభించడానికి సర్వం సిద్ధంగా ఉంది. మధ్యప్రదేశ్ లోని డీప్ ఫారెస్ట్.. పన్నా టైగర్ రిజర్వ్ లో కొత్త చిత్రానికి ఫెంటాస్టిక్ మ్యూజిక్ కుకింగ్ మొదలైంది. వరుసగా అప్ డేట్స్ ఇస్తుంటాం. మేము మీ అంచనాలను అందుకోబోతున్నాం వేచి ఉండండి అంటూ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ పేర్కొన్నారు. తేజ నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఆర్పీ పట్నాయక్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ గా పెద్ద హిట్ అయ్యాయి.