NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

దగ్గుబాటి పురంధరేశ్వరి దశ తిరగబోతోందా?

ఇటీవలే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి దశ తిరగబోతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Daggubati Purandhareshwari stage is about to turn
Daggubati Purandhareshwari stage is about to turn

2014లోనే ఆమె బిజెపిలో చేరినప్పటికీ ఇప్పటివరకు ఆమెకు ఆ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వలేదనే చెప్పాలి.ఆ ఎన్నికల్లో రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చింది అయితే ఆమె ఓడిపోయారు.ఇక గెలవనని తెలిసి కూడా ఆమె పార్టీ కోసం నిన్నటి ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి లోక్ సభకు పోటీ చేసి భంగపడ్డారు. మొత్తం మీద పురందరేశ్వరి బిజెపికి విధేయంగానే ఉంటూ వచ్చారు. ఆ పార్టీలో మంచి రోజుల కోసం ఎదురుచూస్తుండగా ఇన్నాళ్ళకు ఆమె టైం వచ్చింది అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎలాగంటే ఏపీ పై బీజేపీ సీరియస్గా దృష్టి పెట్టింది. రేపటి ఎన్నికల్లో తన మార్క్ మ్యాజిక్ చూపించాలని బిజెపి తహతహలాడుతోంది.

ఈ నేపథ్యంలోనే కులాల సమీకరణకు ఆ పార్టీ కసరత్తు చేసింది. కాపులను కమ్మ సామాజిక వర్గాన్ని సరిచేసుకుంటే అధికార పీఠానికి చేరువ కావచ్చన్నది బిజెపి లెక్కలట. దీన్ని పరిగణలోకి తీసుకొని ఉత్తరాంధ్రలో కాపులను ఆకట్టుకోవడానికి ఆ సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు ని ఏపీ బిజెపి అధ్యక్షుడిని చేశారు. దక్షిణ కోస్తాలో బాగా బలంగా ఉండే కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించడానికి దగ్గుబాటి పురంధరేశ్వరి కి జాతీయ స్థాయి పార్టీ పదవి ఇచ్చారట.కమ్మ సామాజికవర్గం బలంగా ఉన్న క్రిష్ణ, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు వంటి చోట్ల ఎన్టీయార్ వారసురాలు అయిన పురందరేశ్వరి తనదైన మ్యాజిక్ చేస్తారని బీజేపీ పెద్దలు లెక్కలు వేసుకున్నట్లుగా అనిపిస్తోంది. దాంతో చిన్నమ్మ మీద పెద్ద బాధ్యతలే పెట్టారు.నిజానికి టీడీపీ నుంచి చేరిన సుజనా చౌదరి లాంటి వారు బీజేపీలో ఉన్నా కూడా ఎన్టీయార్ లెగసీని తిప్పుకోవడానికే చిన్నమ్మకు ప్రాధాన్యత ఇచ్చారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో దగ్గుబాటి పురందేశ్వరి ఎప్పటినుంచో కలలు కంటున్న రాజ్యసభ సీటు, కేంద్ర మంత్రి పదవి ఆమెకు వచ్చినా ఆశ్చర్యంలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పురంధరేశ్వరిని బాగా వాడుకోవడానికి సిద్ధపడ్డ బిజెపి ఆ మేరకు ఆమెకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తారని వారు విశ్లేషిస్తున్నారు. బీజేపీ రాజకీయం అలాగే ఉంటుంది. రాజ్యసభ సభ్యుడు అయ్యేవరకు ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ నరసింహారావు ఎవరో ఈ ప్రాంతానికే తెలియదు. కాబట్టి చిన్నమ్మ ఆశలు బిజెపిలో నెరవేరే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పవచ్చు.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju