హైదరాబాద్ లోని అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ లో నాలుగేళ్లుగా పనిచేస్తున్న R. విజయ్ గోపాల్ అనే 31 ఏళ్ళ ఉద్యోగిని తన సీనియర్ ఆపరేషన్స్ మేనేజర్ పదవి నుంచి టెర్మినేట్ చేసిన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అయితే ఎందుకు అతనిని టెర్మినేట్ చేసారు అన్న విషయంపై చాలా కధనాలు వినిపిస్తున్నాయి.
ఒక కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మన అందరికి తెలుసు. ఉద్యోగం వచ్చాక క్షణం తీరిక ఉండదు.. ఓవర్ టైంలు అందులో ప్రధాన అంశం. ఏది జరిగినా నోరు మెదపకుండా ఉంటేనే అక్కడ ఉండగలం… వాళ్ళకి ఎదురు తిరిగితే ఉద్యోగం పోతుందేమో అని భయం ఉంటుంది. కానీ R.విజయ్ గోపాల్ మాత్రం ఆలా కాదు. భయపడకుండా తన సంస్థలో చట్టవిరుద్ధంగా అక్కడ ఉన్న ఓవర్ టైం ల గురించి వివరిస్తూ కంప్లైంట్ చేసాడు. దాని ఫలితంగా తనని ఉద్యోగంలో నుంచి తీసేసారు. అతను ఒక అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తున్న స్వచ్చంద సంస్థ స్థాపకుడు.