Marriage: ఏంటి ఆశ్చర్యం కలుగుతుందా? మన పురుషాధిక్య ప్రపంచంలో ఇలాంటివి వింతగా అనిపిస్తాయి. కానీ ఇది అక్షరాలా నిజం. మనం చూస్తూ ఉంటాం. మన చుట్టూ చాలామంది అతి తక్కువ వయస్సులోనే భర్తలను కోల్పోవడమో లేక ఇతరత్రా కారణాల చేత మిగిలిన జీవితాన్ని ఒంటరిగానే సాగిస్తారు. మనస్సులో ఓ తోడు కావాలని వున్నా, చుట్టూ వున్న ప్రపంచాన్ని చూసి మొహమాటంతో ఒంటరిగానే కాలాన్ని వెళ్లబుచ్చుతారు. అయితే కొంతమంది మాత్రం చాలా రేర్ గా ఆ సంప్రదాయాల సంకెళ్లను దాటి తమ ఇష్టానుసారం జీవిస్తూ వుంటారు. ఇపుడు మనం మాట్లాడుకునేది అలాంటివారి గురించే
Red Chilli: ఈ గింజలతో కీళ్ల నొప్పులు క్షణాల్లో మటుమాయం..!!
Marriage: ఈ కథ ఎక్కడ జరిగిందంటే?
ఇది మహారాష్ట్రలో జరిగిన కథ. ఆమె తల్లి వయస్సు సుమారు 35 సంవత్సరాలుంటాయి. కొన్ని అనుకోని కారణాల వలన ఆమె తన భర్తనుండి విడాకులు తీసుకుంది. ఇది జరిగి దాదాపు ఓ 5 సంవత్సరాలు అవుతోంది. కాలేజీ చదువులు చదువుతున్న ఆమె కూతురు తన తల్లి ఒంటరి తనాన్ని గమనించింది. తన తల్లికి మళ్ళీ పెళ్లి ఎందుకు చేయకూడదు అనుకుంది. అనుకున్నదే తడవుగా ఆన్లైన్ మ్యారేజ్ సైట్లలో తన తల్లి ప్రొఫైల్ పెట్టింది. అనుకోకుండా తన తల్లిని అర్ధం చేసుకున్నటువంటి మనిషి వారికి దొరికాడు. ఇంకేముంది కట్ చేస్తే ఇద్దరికీ ఘనంగా పెళ్లి చేసింది.
Mohan babu: ‘నీ వల్ల కాకపోతే నేను ఉన్నా!’ చిరంజీవికి ఝలక్ ఇస్తూ రంగంలోకి దిగిన మోహన్ బాబు!
టీవీ ప్రతినిధులతో ఆమె సమాధానం:
ఈ విషయం తెలిసిన పలువురు టీవీ ప్రతినిధులు ఆమెను సంప్రదించి పలు రకాలైన ప్రశ్నలు వేశారు. వారికి ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చింది.. “నాతల్లి తప్పు చేయలేదు. ఆమెకు ఇపుడు ఓ తోడు అవసరం అని నాకనిపించింది. నేను చదువు రీత్యా బయటే వుంటాను. అన్ని వేళల నేను ఆమెను చూసుకోలేను. సమాజం ఏమనుకుంటుందో అని నేను ఆలోచించను. అలా ఆలోచిస్తే మనం ముందుకు వెళ్లలేం.” అని చెప్పుకొచ్చింది. నిండా 20 నిండని ఆమె మెచ్యూరిటీకి సదరు టీవీ ప్రతినిధులు సలాం చేసారు.