బంధాలు, బంధుత్వాలు కాసుల (డబ్బులు)తో ముడిపడిపోయాయి. కొందరి మనుషుల్లో మానవత్వం నశించిపోతోంది. డబ్బే లోకంగా జీవిస్తున్నారు. కన్నవారినీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికే చాలా మంది వృద్దులు తమ పిల్లలు వారి బాగోగులు చూడకపోవడంతో వృద్ధాశ్రమాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే.. ఆస్తిపాస్తులు పంచినా చివరకు తండ్రికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా దూరంగా ఉండిపోయిన ప్రబుద్ధుడి వైనం ఆ గ్రామంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. చేతికి డబ్బులు ఇస్తేనే తండ్రి చితికి నిప్పు పెడతా.. లేదంటే చివరి చూపు కూడా అవసరం లేదంటూ ఆ కుమారుడు మొహం చాటేయ్యడంతో చేసేది ఏమీ లేక ఆయన కుమార్తె దహన సంస్కారాలను పూర్తి చేసింది. ఈ హృదయ విదారక ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు గ్రామంలో జరిగింది.

విషయంలోకి వెళితే.. అనిగండ్లపాడు గ్రామానికి చెందిన గింజుపల్లి కోటయ్య (80) గతంలో భూమి విక్రయించగా వచ్చిన నగదులో 70 శాతం కుమారుడికి ఇచ్చాడు. 30 శాతం నగదు అతని వద్దే అంటి పెట్టుకున్నాడు. ఆ డబ్బు విషయంలో వివాదం నెలకొనడంతో గింజుపల్లి కోటయ్య దంపతులు గత ఆరు సంవత్సరాలుగా గుమ్మడిదుర్రులోని కుమార్తె వద్దే ఉంటున్నారు. వయోభారంగా కారణంగా అనారోగ్యానికి గురైన కోటయ్య శుక్రవారం మృతి చెందారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు కోటయ్య కుమారుడికి తెలియజేశారు. అయితే తన తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు ఆ కుమారుడు పేచీ పెట్టారు. ఆయన వద్ద ఉంచుకున్న డబ్బులు ఇస్తేనే తలకొరివి పెట్టి కర్మకాండలు పూర్తి చేస్తాననీ లేకుంటే చివరి చూపుకు కూడా రానంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. దీంతో చేసేది ఏమీ లేక కుమారుడు ఉండి కూడా గింజుపల్లి కోటయ్య భౌతికకాయానికి ఆయన కుమార్తె విజయలక్ష్మి.. తలకొరివి పెట్టి అంత్యక్రియలు జరిపించింది. ఈ ఘటన చూపరుల హృదయాలను కలచివేసింది.

Bhuma Akhila Priya: టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్టు.. ఎందుకంటే..?
CPI Narayana: సీఎం జగన్ తో చిరంజీవి భేటీపై కీలక వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ..! ఆ పాయింట్ కరెక్టేగా..?