ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ రంగంలోకి దిగితే రచ్చ మాములుగా ఉండదు. ఎందుకంటే వార్నర్ క్రికెట్ స్టేడియంలో బ్యాట్ పట్టితే.. బౌండరీల మోత మోగుతూ.. స్టేడియం దద్ధరిల్లిపోతుంది. తన బ్యాటింగ్ హిట్టింగ్తో బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. సోషల్ మీడియాలోనూ వార్నర్ ఈ మధ్య కాలంలో తెగ హల్చల్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా లాక్డౌన్ కారణంగా చాలా ఖాళీ సమయం దొరకడంతో ఇంటికే పరిమితమైన వార్నర్.. టిక్‌టాక్‌లో అదరగొట్టేస్తున్నాడు. పలు పాటలకు స్టెప్పులు వేస్తున్నారు.
తనదైన బ్యాటింగ్ స్టైల్‌తో అలరించిన వార్నర్.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి ప్రవేశించిన వార్నర్.. హైదరాబాద్ టీం తరఫున ఆడుతూ.. దేశంలోనే కాకుండా తెలుగునాట కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక టిక్‌టాక్ వీడియోలు చేస్తూ.. తనలోని సరికొత్త స్టైల్‌ను చూపించి… అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా సాంగ్స్ కు స్టెప్పులేసిన వార్నర్ ఫ్యామిలీ.. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ 2020లో బిజీబిజీగా గడిపిన వార్నర్‌కు.. తాజాగా కాస్త బ్రేక్ సమయం దొరకడంతో మళ్లీ టిక్‌టాక్‌తో మనముందుకు వచ్చారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలోని ఓ సీన్లో వార్నర్ రచ్చరచ్చ చేశాడు. ఎంటీ? ఎన్టీఆర్ సినిమాలో వార్నర్ నా? అని అశ్చర్య పోకండి. విషయమేటంటే.. ఆ సినిమాలోని ఫైటింగ్ దృశ్యంలోని యంగ్ టైగర్ ఫేస్ ను మార్ఫింగ్ చేసి తన ఫొటోతో ఉన్న వీడియోను షేర్ చేశాడు వార్నర్.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, వార్నర్ ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ నటించిన “అల వైకుంఠపురంలో” సినిమాలోని “బుట్టబొమ్మ” సాంగ్ కు స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోకు ఏకంగా 450 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు” సినిమాలో “వాడిని కొట్టమను డప్పూ”అనే పాటకు డాన్సు చేసి.. వార్నర్ ఆయన అభిమానులను అలరించారు. అలాగే, ఎన్టీఆర్ హీరోగా నటించిన “జనతా గ్యారేజ్” సినిమాలోని “పక్కా లోకల్” సాంగ్‌కు సైతం స్టెప్పులేశారు వార్నర్.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!