NewsOrbit
న్యూస్ సినిమా

డే 1 కలెక్షన్స్…. ‘సోలో బ్రతుకే సో బెటర్’

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా  వైరస్  కారణంగా దేశంలో విధించిన  లాక్  డౌన్   వలన దాదాపు 9 నెలలు అయ్యింది సినిమా కలెక్షన్స్ ను మనం  తెలుసుకుని. లాక్ డౌన్  అప్పటి నుంచి ఓటిటి పుణ్యమా అని అసలు కలెక్షన్స్ మాటే మర్చిపోయాం. ఏకంగా 9 నెలల తర్వాత తెలుగులో థియేటర్లలో విడుదలైన తొలి క్రేజీ సినిమా సాయి ధరమ్  తేజ్  నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’.  ఈ  సినిమా ను సుబ్బు అనే ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించారు.

డే 1 కలెక్షన్స్…. ‘సోలో బ్రతుకే సో బెటర్’

నిన్న సాయంత్రానికి ఈ సినిమా కి యావరేజ్ టాక్ వచ్చింది. దాదాపు 400 వరకు థియేటర్స్‌లో ఈ సినిమా ను రిలీజ్ చేశారు. వీటిలో ఎక్కువగా మల్టీప్లెక్సులే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోను ఇంకా కొన్ని జిల్లాలలో సింగిల్ స్క్రీన్స్ కూడా ఓపెన్ చేయలేదు పైగా కరోనా నేపథ్యంలో మల్టీప్లెక్సులలో కూడా కేవలం 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉండాలని నిబంధనను విధించారు. చివరికి అలా అన్ని కరోనా నిబంధనలు లోబడి ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. 

డే 1 కలెక్షన్స్…. ‘సోలో బ్రతుకే సో బెటర్’

సాయి ధరమ్ తేజ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు మరియు  వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకి హైలెట్‌గా నిలిచింది.  తమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోశాయని అంటున్నారు. విమర్శకుల దగ్గర కూడా ఓవరాల్‌గా మంచి ఎంటర్‌టైనర్‌ అని టాక్ రావడంతో యూనిట్ ఊపిరి పీల్చుకుంది.

అయితే తొలి రోజున ఈ చిత్రం రూ.91.37 లక్షల రూపాయల వసూళ్లను నమోదు చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో రూ.26 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.18 లక్షలు, గుంటూరు జిల్లాలో రూ.22 లక్షలు, కృష్ణ జిల్లాలో రూ.13 లక్షలు, అలాగే నెల్లూరులో 11 లక్షలు వసూలుచేసింది. ఇక సీడెడ్‌లో కూడా ఈ చిత్రం 52 లక్షల రూపాయలను రాబట్టడం విశేషంగా పేర్కొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోను ఈ సినిమా రూ.2.80కోట్లను(4.7Cr+) రాబట్టనున్నట్లు తెలుస్తుంది.

 

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu