‘లోట‌స్ పాండ్’లో అనుమానాస్పద డెడ్ బాడీ.. పోలీసులు ఏం అంటున్నారంటే?

ప‌బ్లిక్ పార్కులు మ‌హా నగ‌రాల్లో ఎంతో మందికి సేద తీరుస్తాయి. ఇరుకిరుకు ఇళ్ల‌ల్లో ఉండే జ‌నానికి ఆదివారం వ‌చ్చిందంటే చాలు వారి పిల్ల‌ల‌తో కొంత స‌మ‌యం కేటాయించ‌డంతో పాటు కొంత సేపు వ‌ర్క్ టెన్ష‌న్స్ నుంచి బ‌య‌ట ప‌డొచ్చని పార్కుల‌కు, సినిమాల‌కు వెళ్తుంటారు. ఆ ప్ర‌దేశాల్లో అన్ని ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటార‌ని, సెక్యూరిటీ, నిఘా చాలా ఉంటుందని ఆ ప్రాంతాల‌ను జ‌నం ఎన్నుకుంటారు. కానీ కొంద‌రు ఆ ప్రాంత‌ల‌ను టార్గెట్ చేసుకుని కిరాత‌కాల‌కు, ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతుంటారు.

ప‌బ్లిక్ పార్కుల్లో కిరాత‌కాల‌ను, ఆత్మ‌హ‌త్య‌ల‌ను చూసి ఈ ప్రాంతాల్లోకి కూడా వెళ్లొద్ద‌ని, అక్క‌డా సెక్యూరిటీ ఉండ‌ద‌ని భ‌య‌ప‌డుతుంటారు. ఇలాంటి భ‌యాలు ఉండొద్ద‌ని పోలీసులు ఎన్ని ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకున్నా.. అప్పుడ‌ప్పుడూ మ‌ళ్లీ ఈ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డంతో జ‌నాల‌ను భ‌య‌పెడుతున్నాయి.

ఇలాంటి ఘ‌ట‌న ఇప్పుడు లోట‌స్ పాండ్ లో జ‌రిగింది. ఒక గుర్తు తెలియని మృత‌దేహం క‌న్పించి అంద‌రినీ భ‌యానికి గురిచేస్తోంది. ఈ గుర్తుతెలియని వ్యక్తి మృత‌దేహాన్ని పోలీసులు బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నిసున్న‌ట్లు స‌మాచారం. ఇది హ‌త్య లేక ఆత్మ‌హ‌త్య అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మృతి చెందిన వ్య‌క్తి టీష‌ర్ట్, ట్రాక్ పాయింట్ వేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివ‌రాల కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ విష‌యాలు అన్నీ భ‌య‌ట‌కు వ‌చ్చినాక హ‌త్య లేక ఆత్మ‌హ‌త్య అనేది తెలుస్తుంది. ర‌ద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇది ఎలా జ‌రిగింది అనేది కూడా తెలుసుకునే ప్ర‌య‌త్నంలో పోలీసులు ఉన్నారు.