న్యూస్

Dead Body Jewellery: మృతదేహాలతో ఆభరణాల తయారీ.. ఎక్కడైనా విన్నారా?

Share

Viral: ప్రపంచంలో ఎక్కడైనా.. అతివలు మెచ్చే ఆభరణాలు ముఖ్యంగా బంగారం, ప్లాటినం రూపాలలో మనం చూస్తూ వుంటాం. అయితే రొటీన్ కు భిన్నంగా, చనిపోయిన మృతదేహాల పార్ట్స్ తో నగల తయారీ విధానాన్ని ఎక్కడైనా విన్నారా? కానీ మీరు విన్నది అక్షరాలా నిజం. ఇపుడు అలాంటి నగలు తయారు చేయడానికి సో కాల్డ్ జెవెల్ కంపెనీలు సిద్ధంగా వున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా చోట్ల ఇలాంటి నగలకు గిరాకీ ఏర్పడింది.

వీటిపై ఎందుకంత మక్కువ?

అయితే దీనికి ఏకైక కారణం ఒక మనిషి మీద, ఇంకో మినిషికున్న అభిమానమే. అవును.. సాధారణంగా మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారికి గుర్తుగా ఏ చొక్కానో, చీరో మరేదో ఉంచుకోవడం మనకు తెలిసినదే. కానీ అదే మృతదేహం అవయవాలను ఆభరణాలుగా చేసి దాచుకొనే సాంప్రదాయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అలా తయారు చేసిన ఆభరణాలను మెడలో ధరించి మురిసిపోతున్నారు నేటి తరం మహిళలు.

ఆభరణాలుగా వేటిని ముఖ్యంగా ఉపయోగిస్తున్నారు?

మృతదేహాల గోళ్లు, అస్తికలు, పళ్లు, జుట్టుని సాధారణంగా వాడుతున్నారు. జుట్టుని విగ్గుల రూపంలో అనేకమంది వాడుతున్నారు. గోళ్ళని లాకెట్స్ తయారీలో వాడుతున్నారు. అస్థికలను.. పళ్ళను హారాల తయారీలో ఉపయోగించి వాడుతూ మురిసిపోతున్నారు. ఇక ఈ ఆభరణాల కాన్సెప్ట్ వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుని నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మాకు ఈ ఐడియా తట్టనేలేదని, ఇకనుండి మేము కూడా ఇలాంటివి తయారు చేసుకుంటామని చెబుతున్నారు. వాటిని ధరిస్తూ.. చనిపోయిన వారు ఇక తమతోనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు. అలాగే వారి జుట్టును ఉంగరాల్లో భద్ర పరచి వారి ఆత్మ తమతోనే ఉన్నట్లు భావించి బతికేస్తున్నారు. ఇష్టమైతే మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు… కాదేదీ ఆభరణాలకు అనర్హం అన్నమాట!


Share

Related posts

అంత దూరం రాలేను

Siva Prasad

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో మొత్తం ఎన్ని రీమేక్ సినిమాలు చేశారో తెలుసా..??

sekhar

ఆలయాలపై నకిలీ వెబ్‌సైట్‌లు ఉన్నాయి జాగ్రత్త!

somaraju sharma