NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

చనిపోయిన బాలుడు.. ఖననానికి ముందు కదిలాడు.. చివరికి?

ఎక్క‌డైనా ఎవ‌రు చేయాల్సిన ప‌నులు వాళ్లు చేయాలి. అలా కాకుండా ఇత‌రుల ప‌నుల్లో వేరే వాళ్లు క‌లుగ‌చేసుకుని వ్య‌వ‌హ‌రిస్తే ఎంతో న‌ష్టాన్ని చ‌వి చూడాల్సి వ‌స్తుంది. అయితే ప్రాణాల‌ను కాపాడే డాక్ట‌ర్ల విష‌యంలో ఇలాంటి త‌ప్పిదాలు కాకుండా చూడాల్సిన అవ‌స‌రం చాలా ఉంది. అలా కాకుండా డాక్ట‌ర్ చేయాల్సిన ప‌ని కంపౌండ‌ర్ చేస్తే ఎలా ఉంటుంది ? ఎంత న‌ష్టాన్ని మిగిలిస్తుంది. ఇలాంటి ఘ‌ట‌నే ఒక ద‌గ్గ‌ర జ‌రిగి ఒక చిన్నారి ప్రాణాల మీద‌కు తీసుకు వ‌చ్చింది.

ఏడాది లోపున్న ఒక చిన్నారి తీవ్ర అస్వస్థతకు గుర‌య్యాడు. దాంతో ఆ బాలున్ని చికిత్స కోసం ద‌వాఖాన‌కు తీసుకు పోయారు ఆ బాలుడి త‌ల్లిదండ్రులు. ఆ స‌మ‌యంలో ఆస్పత్రిలో డాక్ట‌ర్ లేడు. దాంతో ఆ బాలున్ని కంపౌండర్ చెక్ చేశాడు. అంత‌కు ముందే ఆ బాలుడు చనిపోయాడని తెలిపాడు. దాంతో ఆ త‌ల్లిదండ్రుల గుండెల‌ను బాదుకున్నారు. చేసేదేం లేక ఆ బాలున్ని తీసుకుని ఇంటికి వెళ్లారు ఆ తల్లిదండ్రులు.

ఇంటికి తీసుకొచ్చినాక‌ ఖననం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఖననానికి కొద్ది ముందు బాలుడిలో క‌ద‌లిక‌లు రావ‌డం అంతా గ‌మ‌నించారు. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఈ సంఘటన అసోంలోని దిబ్రుఘర్ జిల్లాలో ఆదివారం జ‌రిగింది. దిబ్రుఘర్ జిల్లాలోని మఠక్ టీ ఎస్టేట్‌కు చెందిన ఒక చిన్నారితీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. ఆందోళన చెందిన ఆ చిన్నారి తల్లిదండ్రులు.. ఆ చిన్నారిని చికిత్స కోసం దిబ్రుఘర్‌లోని అసోం మెడికల్ కాలేజీ హాస్పిట‌ల్ కు తీసుకుపోయారు.

ఆ సమయానికి అక్క‌డ డాక్ట‌ర్ లేడె, విధుల్లో ఉన్న కంపౌండర్ ఆ చిన్నారిని చెక్ చేసి అప్ప‌టికే చనిపోయాడ‌ని పేర్కొన్నాడు. కంపౌండర్ చెప్పింది నిజమేనని న‌మ్మారు ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు. ఎంతో దుఃఖంతో చిన్నారిని ఇంటికి తిసుకుని వ‌చ్చారు. ఖననానికి కొన్ని నిమిషాల ముందు ఆ చిన్నారి కదిలాడు. దీంతో అంద‌రూ షాక్ అయ్యారు. వెంట‌నే స్పృహలోకి వచ్చిన ఆ చిన్నారిని తీసుకుని హాస్పిట‌ల్ కు వెళ్లారు.

హాస్పిట‌ల్ ముందు ఎదుట ధర్నా చేప‌ట్టారు. బతికున్న చిన్నారిని చనిపోయాడని చెప్పి తమను మోసం చేశారని ఆరోపించారు. దీనికి కార‌కులైన‌ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో లాహోవాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి కార‌కుడైన కంపౌండర్‌ను అరెస్టు చేసి, రిమాండ్ కు త‌ర‌లించారు.

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk