దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లో ఎంటరైన గోవా బ్యూటీ ఇలియానా. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వత డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగనాధ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ లో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంది. క్షణం తీరిక లేనంతగా చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపింది. టాలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది.
ఇలియానా నడుముకి ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. తను చేసే బెల్లీ డాన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. అంతేకాదు ఇలియానాకి తన నడుమంటే ఎంతో ఇష్టమని అందుకే ఎక్కువగా డాన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తానని వెల్లడించిన సందర్భం కూడా ఉంది. అయితే ఉన్నట్టుండి టాలీవుడ్ లో కనుమరుగైపోయింది ఇలియానా. చాలాకాలం తర్వాత మళ్ళీ తన హిట్ పేయిర్ మాస్ మహారాజ రవితేజ తో అమర్ అక్బర్ ఆంటోనీ అన్న సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది.
కాని ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు తన హాట్ హాట్ ఫోటోలతో ఫ్యాన్స్ ని కనువిందు చేస్తోంది. దాంతో ఇంత తరగని అందం పెట్టుకొని తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదు..మాకోసం మళ్ళీ ఒక తెలుగు సినిమా చేయొచ్చు కదా.. అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ అంటున్నారట.
అయితే బాలీవుడ్ లో ఒకటి, రెండు సినిమాలు చేస్తున్న ఇలియానా ఇప్పుడు తెలుగులో కూడా నటించబోతుందన్న వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన “రైడ్” సినిమాని తెలుగులో నాగార్జున రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో అజయ్ దేవగన్, ఇలియానా జంటగా నటించారు. అందుకే తెలుగు రీమేక్ లోనూ ఇలియానా నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే మరోసారి రవితేజ తో నటించే ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది.
తమిళంలో అరవింద స్వామి, త్రిష కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘శతురంగ వెట్టై 2’. ఈ సినిమాని తెలుగులో మాస్ మహారాజా చేయనున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించబోతుందని సమాచారం. ఇప్పటికే రవితేజ తో ఇలియానా కిక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని.. సినిమాలలో నటించింది.